Ads
తెలంగాణ రాష్ట్రం వైవిధ్యతను, విశిష్టత కలిగి ఎంతో ప్రత్యేకతను సాధించింది. విభిన్న సంస్కృతుల ఖజానా తెలంగాణ. అనేక ప్రాచీన సంస్కృతులు ఇక్కడ ఇంకా సజీవం గా ఉన్నాయి. అలాగే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. ఇంకా దసరా సందర్భంగా జరిపే బోనాలకు కూడా ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Video Advertisement
అయితే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇటువంటి ఎన్నో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అనేక చిత్రాల్లో అందం గా తెరకెక్కించారు. ఇప్పుడు ఆ చిత్రాలేవో చూద్దాం..
#1 బలగం
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తీసిన చిత్రం బలగం. తెలంగాణ లోని విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన బలగం చిత్రం కుటుంబ విలువలను కలిగి ఉన్న సినిమాగా చాలా బాగా ఆకట్టుకుంది.
#2 లవ్ స్టోరీ
నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ స్టోరీ చిత్రం లో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి వివరించారు.
#3 దసరా
నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం దసరా. ఈ చిత్రం ఈ సినిమా కథ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ లో డైలాగ్స్ మెప్పించాయి.
#4 డీజే టిల్లు
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు చిత్రం కూడా తెలంగాణ నేపథ్యం లోనే సాగుతోంది.
#5 జాతి రత్నాలు
నవీన్ పోలిశెట్టి హీరో గా వచ్చిన జాతి రత్నాలు చిత్రం లో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి చూపించారు.
#6 ఆర్ఆర్ఆర్
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం లోని కొమురం భీం కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడే.
#7 రాజన్న
నాగార్జున హీరోగా వచ్చిన రాజన్న మూవీ లో కూడా ఆనాటి తెలంగాణ పరిస్థితుల్ని చూపించారు.
#8 ఫిదా
వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫిదా మూవీ లో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి చూపించారు.
#9 ఒసేయ్ రాములమ్మ
విజయ శాంతి ప్రధాన పాత్రలో 1997 వ సంవత్సరం లో వచ్చిన ఒసేయ్ రాములమ్మ చిత్రం లో కూడా ఆనాటి తెలంగాణ పరిస్థితుల్ని చూపించారు.
#10 బతుకమ్మ
హీరోయిన్ సింధు తులాని ప్రధాన పాత్రలో వచ్చిన బతుకమ్మ చిత్రం లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు.
#11 ఫలక్ నామా దాస్
ఈ సినిమాలో కూడా హైదరాబాద్ లో జరిగే పరిస్థితులని చూపించారు.
#12 సమ్మక్క సారక్క
రోజా, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో దాసరి నారాయణ రావు తెరకెక్కించిన సమ్మక్క సారక్క చిత్రం తెలంగాణ నేపథ్యం లోనే సాగుతుంది .
End of Article