తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నో నవలలను సినిమాలుగా తెరకెక్కించారు. ఇటీవల కాలంలో అంతగా  నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు రాలేదు.

Video Advertisement

కానీ ఒకప్పుడు నవలల ఆధారంగానే ఎక్కువగా చిత్రాలు తెరకెక్కించేవారు. అలా వచ్చిన సినిమాలు ఘన విజయం సాధించాయి. అలా టాలీవుడ్ లో నవల ఆధారంగా వచ్చిన కొన్ని చిత్రాలను ఇప్పుడు చూద్దాం..
1.జీవన తరంగాలు:

తాతినేని రామారావు దర్శకత్వంలో 1973లో రిలీజ్ అయిన కుటుంబ కథా చిత్రం జీవన తరంగాలు. ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని యద్దనపూడి సులోచనారాణి రచించిన ‘జీవన తరంగాలు’ అనే నవల ఆధారంగా తీశారు.
2.మీనా:

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా మహిళా దర్శకురాలు విజయ నిర్మల నటించి, దర్శకత్వం వహించిన సినిమా మీనా. ఈ మూవీ 1973 డిసెంబర్ 28న రిలీజ్ అయ్యింది. రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘మీనా’ అనే నవల ఆధారంగా ఈ మూవీ నిర్మించబడింది.
3.సెక్రటరీ:

1976లో అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా నటించిన సినిమా సెక్రటరీ. యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘సెక్రటరీ’ అనే నవల ఆధారంగా ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించారు.
4. అభిలాష:

మెగాస్టార్ చిరంజీవి, రాధిక హీరో హీరోయిన్లుగా నటించిన అభిలాష చిత్రం రచయిత యండమూరి రాసిన ‘అభిలాష’ ఆధారంగా తెరకెక్కింది. 5. ఏప్రిల్ 1 విడుదల:

డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని రచయిత కొలపల్లి ఈశ్వర్ రాసిన ‘హరిశ్చంద్రుడు-అబద్డమాడితే’ అనే నవల స్పూర్తితో  తెరకెక్కించారు.
6. ఛాలెంజ్:

చిరంజీవి, సుహాసిని, విజయశాంతి నటించిన ఛాలెంజ్ మూవీ రచయిత యండమూరి రాసిన ‘డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు’ నవల ఆధారంగా తీశారు.
7. సితార:

దర్శకుడు వంశీ తానే రచించి, దర్శకత్వం వహించిన చిత్రం సితార. అయితే ఈ చిత్రం ‘మహాలో కోకిల’ నవల ఆధారంగా రూపొందింది. ఈ నవలను రాసింది కూడా దర్శకుడు వంశీ.
8. అహా నా పెళ్ళంట:

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రజిని జంటగా నటించిన చిత్రం అహా నా పెళ్ళంట. ఈ చిత్రాన్ని రచయిత ఆది విష్ణు రాసిన ‘సత్య గారి ఇల్లు’ అనే నవల ఆధారంగా తీశారు.
9. చంటబ్బాయ్:

చిరంజీవి, సుహాసిని జంటగా నటించిన చంటబ్బాయ్ చిత్రాన్ని రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘చంటబ్బాయ్’ నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కించారు.
10. ఆఖరి పోరాటం:

కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, శ్రీదేవి, సుహాసిని నటించిన చిత్రం ఆఖరి పోరాటం. ఈ చిత్రాన్ని యండమూరి రాసిన ‘ఆఖరి పోరాటం’ అనే నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కించారు.  ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచి, ఆల్ టైమ్ బెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
11. దొంగ మొగుడు:

చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన చిరు ద్విపాత్రాభినయం చేశాడు. ఈ మూవీని ఆధారంగా యండమూరి రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవల ఆధారంగా దర్శకుడు కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. చిరంజీవి కెరీర్‌లో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది.
12. జ్యోతి లక్ష్మి:

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఛార్మి, సత్యదేవ్ నటించిన చిత్రం జ్యోతి లక్ష్మి. ఈ సినిమాని మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన నవల ఆధారంగా రూపొందించారు.
13. మిధునం:

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం మిథునం. ఈ సినిమాని రచయిత రమణ రాసిన  ‘మిధునం’ అనే నవలా ఆధారంగా రూపొందించారు. తనికెళ్ళ భరణి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.14. జ్యో అచ్యుతానంద:

నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం జ్యో అచ్యుతానంద. ఈ మూవీని దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈ మూవీని ’చివరికి మిగిలేది’ నవల ఆధారంగా తీశారు. అంతే కాదు ‘అమృతం కురిసిన రాత్రి’ అనే నవల ప్రభావం కూడా ఈ చిత్రం పై ఉంది.
15. అ..ఆ:

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం అఆ. ఈ చిత్రాన్ని యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘మీనా’ అనే నవల ఆధారంగా తీశారు.

Also Read: “జూనియర్ ఎన్టీఆర్” లాగానే… తమ “ఇంగ్లీష్” యాక్సెంట్ వల్ల ట్రోలింగ్‌కి గురైన 7 నటులు..!