“పుష్ప” లాగానే… “రిలీజ్” అయిన నెలలోపే OTT లోకి వచ్చిన 12 సినిమాలు..!

“పుష్ప” లాగానే… “రిలీజ్” అయిన నెలలోపే OTT లోకి వచ్చిన 12 సినిమాలు..!

by kavitha

Ads

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ల హవా నడుస్తోంది. ఇటీవల కాలంలో థియటర్స్ లో విడుదలైన చిత్రాలు నెల రోజులు గడవక ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లలో దర్శనమిస్తున్నాయి.

Video Advertisement

ప్రస్తుతం వస్తున్న సినిమాలకు థియేట్రికల్ వసూళ్ల లాగానే ఓటీటీ రైట్స్‌ కూడా ముఖ్యంగా మారాయి. సినిమా ఫ్లాప్ అయినా మేకర్స్ ఆ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం ద్వారా వచ్చిన నష్టాలను భర్తీ చేసుకుంటున్నారు.
సాధారణంగా పెద్ద చిత్రాలను రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ కొన్ని సినిమాలు విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వస్తున్నాయి. అలా నెలలోపే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1. పుష్ప

అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన మూవీ పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ మూవీ 17 డిసెంబర్, 2021 పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ నెలలోపే 7 జనవరి, 2022న ఓటీటీలో విడుదల అయ్యింది.
2. విరాట పర్వం:

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’ 17 జూన్, 2022న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం బక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. దాంతో ఈ చిత్రాన్ని నెలలోపే 1 జులై, 2022న ఓటీటీలో రిలీజ్ చేశారు.
3. యశోద:

సమంత లీడ్ రోల్ లో నటించిన చిత్రం యశోద. ఈ సినిమాని హరి, హరీష్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది 11 నవంబర్, 2022 న విడుదల కాగా, మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలో నెలలోపే 9 డిసెంబర్ 2022న రిలీజ్ చేశారు.
4. ధమాకా:

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్స్ గా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రానికి త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా 23 డిసెంబర్, 2022న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రాన్ని 22 జనవరి, 2023న ఓటీటీలో రిలీజ్ అయ్యింది.
5. తెగింపు:

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తెగింపు చిత్రం సంక్రాంతి కానుకగా 10 జనవరి, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రాగా, 8 ఫిబ్రవరి, 2023న ఓటీటీలో విడుదల చేశారు.6. హంట్:

సుధీర్ బాబు హీరోగా, శ్రీకాంత్, భరత్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం హంట్. మహేశ్‌ సూరపనేని తెరకెక్కించిన ఈ చిత్రం 26 జనవరి, 2023 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదటి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నెలలోపే ఈ చిత్రాన్ని 10 ఫిబ్రవరి, 2023న ఓటీటీలో రిలీజ్ చేశారు.7. బలగం:

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్ వేణు వెల్డండి తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఈ మూవీ ఎలాంటి ప్రచారం లేకుండా 3 మార్చి, 2023న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని 24 మార్చి , 2023న ఓటీటీలో రిలీజ్ చేశారు.balagam-movie-watched-the-entire-village-people28. దసరా:

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నేచురల్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దసరా. ఈ చిత్రం 30 మార్చి, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రం థియేటర్లలో ఉండగానే 27 ఏప్రిల్, 2023న ఓటీటీలో విడుదల అయ్యింది.between dasara, viprupaksha which movie got more profits..!!9. రంగ మార్తాండ:

డైరెక్టర్ కృషవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం నటించిన చిత్రం రంగ మార్తాండ. ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ నటించారు. ఈ చిత్రాన్ని 22 మార్చి, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా నిరాశ పరిచింది. నెలలోపే ఈ చిత్రాన్ని 7 ఏప్రిల్, 2023న ఓటీటీలో విడుదల చేశారు.
10. దాస్ కా ధమ్కీ:

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ చేయగా, నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం 22 మార్చి, 2023న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని 14 ఏప్రిల్ , 2023న ఓటీటీలో విడుదల చేశారు.
11. రావణాసుర:

డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించిన రావణాసుర చిత్రంలో మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించగా, యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ 7 ఏప్రిల్, 2023న థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రాగా, 28 ఏప్రిల్, 2023న ఓటీటీలో రిలీజ్ చేశారు.
12. ఏజెంట్:

అఖిల్ అక్కినేని హీరోగా, మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం 28 ఏప్రిల్, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రాన్ని నెలలోపే మే 19, 2023న ఓటీటీలో రిలీజ్ కానుంది.

Also Read: “ఆచార్య” తో పాటు… హీరోల పక్కన “హీరోయిన్స్” లేకుండానే వచ్చిన 10 సినిమాలు..!


End of Article

You may also like