Ads
దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నయనతార చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది.
Video Advertisement
మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత లూసిఫర్ మాదిరిగానే హీరోయిన్ లేకుండా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. అలా హీరోయిన్ లేనప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈయన తరహాలో హీరోయిన్ లేకుండా నటించిన హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
#1 చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ముందుగా అభిమానులకు పాటలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా హీరోయిన్స్‌తో ఆయన వేసే స్టెప్పుల కోసమే సినిమాలకు వెళ్లే అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ యేడాది విడుదలైన ‘ఆచార్య’లో చిరంజీవి సరసన ఏ హీరోయిన్ నటించకపోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోందని చెప్పారు. కానీ కథలో హీరోయిన్ పాత్ర పంటి కింద రాయిలా ఉంటుందనే భావనతో ఈ సినిమాలో కథానాయిక లేకుండానే నటించారు చిరంజీవి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.’గాడ్ ఫాదర్’ చిత్రం మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
#2 బాలకృష్ణ
బాలకృష్ణ కూడా ఆయన టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన ‘‘వేములవాడ భీమకవి’’ అనే మూవీలో కథానాయక లేకుండానే ఒంటరిగానే నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘ శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ లో నారదుడు పాత్రలో కథానాయిక లేకుండా నటించారు. గతేడాది చివర్లో బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ మూవీలో టైటిల్ పాత్రధారికి కథానాయిక లేదు.
#3 నాగార్జున
నాగార్జున కూడా ‘శిరిడిసాయి’, ‘గగనం’ వంటి సినిమాల్లో కథానాయికగా లేకుండానే నటించి మెప్పించడం విశేషం. ఆ తర్వాత కూడా రాజు గారి గది 2’, ’ఆఫీసర్’ వంటి సినిమాల్లో కూడా కథానాయికగా లేకుండా సింగిల్‌గానే నటించి మెప్పించారు.
#4 వెంకటేష్
వెంకటేష్ కూడా ఈనాడు సినిమాలో హీరోయిన్ లేకుండా సింగిల్‌గానే నటించారు. ఇదే సినిమాలో కమల్ హాసన్ కూడా కథానాయిక పాత్ర లేకుండానే చేయడం విశేషం.
#5 కమల్ హాసన్
కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో సూర్య ప్రత్యేక అతిథి పాత్రలో నటించిన మూవీ ‘విక్రమ్’. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించారు. కానీ కమల్ హాసన్ కి జోడిగా హీరోయిన్ లేదు. అయినప్పటికీ ఈ సినిమా విజయం సాధించింది.
#6 కార్తీ
కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ లేకుండానే నటించాడు కార్తీ. అయినప్పటికీ ఈ సినిమా మంచి విజయం సాధించింది.
#7 పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “బంగారం” చిత్రంలో “పవన్ కళ్యాణ్” జోడిగా హీరోయిన్ క్యారెక్టర్ లేదు. మీరా చోప్రా ఫ్రెండ్ గా నటిస్తుంది. సినిమా క్లైమాక్స్ లో “త్రిష” గెస్ట్ రోల్ లో చేసారు.
#8 మోహన్ బాబు
మోహన్ బాబు కూడా హీరోగా ప్రమోషన్ పొందిన కొన్ని సినిమాల్లో హీరోయిన్ లేకుండా సింగిల్‌గా నటించి వావ్ అనిపించాడు.
#9 కృష్ణ
హీరో సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ పీక్స్‌లో ఉండగానే’ఈనాడు’‘రాజకీయ చదరంగం’ వంటి సినిమాల్లో కథానాయిక, డ్యూయట్స్ లేకుండా నటించి మెప్పించడం విశేషం.
#10 కృష్ణంరాజు
కృష్ణంరాజు కూడా హీరోగా స్టార్ డమ్ వున్నపుడే ‘టూటౌన్ రౌడి’, గ్యాంగ్ మాస్టర్’ వంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్ లేకుండానే నటించి మెప్పించారు.
ఏమైనా ఎఫుడు హీరోయిన్స్‌తో యుగళ గీతాలు పాడుకుంటూ టైమ్ పాస్ చేసే హీరోలు… గ్లామర్ మీద ఆధారపడకుండా కథా బలంతో సక్సెస్ అందుకోవచ్చని ఆయా సినిమాలతో ప్రూవ్ చేసారు.
End of Article