సినిమాల్లోకి రాకముందు “సీతారామమ్” హీరోయిన్ ఏం చేసేదో తెలుసా.?

సినిమాల్లోకి రాకముందు “సీతారామమ్” హీరోయిన్ ఏం చేసేదో తెలుసా.?

by Mohana Priya

మములుగా ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక హిట్ ఇస్తే… ప్రజలు ముందుగా చేసే పని అందులో నటించిన నటుల వివరాలు తెలుసుకోవడం. ఇక జూలై 2022 లో విడుదలైన సినిమాలు అన్ని ఫ్లాప్ అయినప్పటికీ… మంచి ప్రేమ కథతో తెరకెక్కిన సినిమా సీతా రామమ్ సూపర్ హిట్ అయ్యింది.

Video Advertisement

30 కోట్లకు పైన బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాగా బాక్స్ ఆఫీసులో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇటు లెఫ్టినెంట్ గా నటించిన దుల్కర్ పాత్ర, అటు సీతగా నటించిన మృణాల్ పాత్ర అభిమానులకు ఎంతో నచ్చింది. దానికి తోడు మృణాల్ తెలుగులో పరిచయం అయిన తొలి సినిమా ఇదే కావడంతో…మృణాల్ ఎవరు ఎక్కడ నుండి వచ్చింది అనే చర్చలు జరుగుతున్నాయి.

connection between mrunal thakur and baahubali movie

అయితే మృణాల్ ఠాకూర్ మహారాష్ట్రలోని దులే ప్రాంతంలో జన్మించింది. కానీ చదువు మాత్రం ముంబయిలో పూర్తి చేసింది. ముంబైలోని కిషన్ చంద్ చెళ్ళారం కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. తరువాత నటనపై ఉన్న ఆసక్తితో, తొలుత టివి సీరియల్స్ వైపు పయనం మొదలు పెట్టింది. అక్కడి నుండి ఇక వెనక్కి తిరిగి చూస్కోకొలేదు. కుంకుమ భాగ్య, వంటి సీరియల్స్ తో మంచి పేరు పొందింది. అలా 2012 నుండి2016 వరకు టీవీ సీరియల్స్ లో జీవింతాన్ని కొనసాగించింది. అదలా ఉండగానే 2014లో మెల్లగా సినీ ప్రపంచం వైపు అడుగులు వేసింది. మరాఠీ, హిందీ భాషల్లో అనేక సినిమాలు తీసి, ఇప్పుడు తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.

sita ramam movie review

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. తెలుగు సినిమాలు చూస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా.. చాలా. మహానటి మీ అందరికంటే ముందు నేనే చూసాను అని తెలిపింది. అందులో కీర్తి సురేష్ నటన చూసి కచ్చితంగా తనకు అవార్డ్ వస్తుంది అనుకున్నానని…అనుకున్నట్టుగానే తనకు అవార్డ్ వచ్చిందని మృణాల్ తెలిపింది.

sita ramam movie review

ఒకరోజు జెర్సీ మూవీ షూట్ లో ఉన్నప్పుడు గౌతమ్ తిన్ననూరి గారు నీకు మంచి ఫ్యూచర్ ఉందన్నారని గుర్తు చేసుకుంది. ఇప్పుడు ఆయన అన్నట్టుగానే మంచి ఛాలెంజింగ్ పాత్ర లభించిందని… తనకు కూడా ఇలాంటి పాత్రలు, కొత్త కొత్తవి చెయ్యడం ఇష్టమని చెప్పుకొచ్చింది.దీంతో తెలుగు సినీ పరిశ్రమలో మృణాల్ మరిన్ని సెన్సేషనల్ పాత్రలు చేసే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి


You may also like