పది రోజుల్లోనే షూటింగ్ పూర్తి…నేరుగా OTT లో రిలీజ్ అయిన ఈ “మృణాల్” సినిమా చూసారా.?

పది రోజుల్లోనే షూటింగ్ పూర్తి…నేరుగా OTT లో రిలీజ్ అయిన ఈ “మృణాల్” సినిమా చూసారా.?

by Harika

Ads

మామూలుగా సినిమా అంటే చాలా నెలల సమయం పడుతుంది. అదే రాజమౌళి లాంటి దర్శక దిగ్గజం సినిమాని ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ముగిస్తాడు. అయితే అవి ఇండస్ట్రీ హిట్లు అవుతాయి అనుకోండి అది వేరే విషయం, కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కేవలం పది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది . ఆ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Video Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే 2020 డిసెంబర్ 14న మూవీ షూటింగ్ మొదలైంది, డిసెంబర్ 24,2023 కి షూటింగ్ కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ యాక్షన్ త్రిల్లర్ మూవీ ని సింగల్ షెడ్యూల్లో చిత్రీకరించారు. కార్తీక్ ఆర్యన్, మృణాల్ ఠాగూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అమృత సుభాష్ కీలకపాత్ర పోషించింది. బాలీవుడ్ హిస్టరీలో అతి తక్కువ రోజుల్లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని రికార్డు క్రియేట్ చేసిన సినీమాల్లో ధమాకా ఒకటి.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ కు మాత్రం నాలుగైదు నెలలు టైం తీసుకున్నారు. కోవిడ్ కారణంగా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్టుగా ఓటీటీ లోనే ఈ మూవీని రిలీజ్ చేశారు. ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో 90% షూటింగ్ ని కంప్లీట్ చేశారు. కోవిడ్ కారణంగా 300 మంది ఆర్టిస్టులకు హోటల్లోనే వసతి కల్పించి షూటింగ్ పూర్తయ్యే వరకు వారిని బయటికి పంపించలేదు, కొత్తవారిని లోపలికి రానివ్వలేదు. రెండు యూనిట్లతో సినిమాని షూట్ చేశారు.

కథ విషయానికి వస్తే అర్జున్ పట్నాయక్ అనే జర్నలిస్ట్ పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటించాడు. ఒకరోజు అతనికి బాంద్రా ఓర్లీ బ్రిడ్జ్ పేల్చేస్తామని టెర్రరిస్టుల దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అసలు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అతని భార్య జర్నలిస్ట్ సౌమ్య పట్నాయక్ పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ ఎందుకు అర్జున్ నుంచి విడాకులు తీసుకుంది? ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే సినిమా కధ.


End of Article

You may also like