Ads
‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మృణాల్ ఠాకూర్. ఈ చిత్రం లో సీతగా ఈమె అభినయానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Video Advertisement
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రకు దీపికను అనుకోలేదట. వేరే బాలీవుడ్ భామను ఎంపిక చేశారట. మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యం లో వస్తున్న ఈ చిత్రం లో ప్రభాస్ సరసన ఒక కొత్త హీరోయిన్ ఉంటే బావుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ అనుకున్నారట. దీంతో ఆ పాత్రకు మృణాల్ ఠాకూర్ ను ఎంచుకున్నారట.
తర్వాత హను రాఘవపూడి చెప్పిన సీతా రామం కథ విన్న నాగ్ అశ్విన్.. ఆ పాత్రకు మృణాల్ అయితే చక్కగా ఉంటుందని సూచించారట. ‘ప్రాజెక్ట్ కె’ కోసం వేరే హీరోయిన్ ను తీసుకుంటానని నిర్మాత అశ్వినీ దత్ కు తెలిపారట నాగ్ అశ్విన్. తాజాగా ఈ విషయాన్నీ నిర్మాత అశ్వని దత్ ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.
అలా ప్రభాస్ పక్కన ఛాన్స్ మిస్ అయినా మృణాల్ ‘సీతా రామం’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అలా ప్రభాస్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకొని, సీతా రామం లో సీత గా జీవించి మనల్ని అలరించింది. ప్రాజెక్ట్ కె లో నటిస్తే ఆమెకు ఎంత గుర్తింపు వచ్చేదో తెలీదు కానీ సీతారామం తో అందరికి చేరువైపోయారు మృణాల్.
ఈ సినిమా హిట్‌తో ఈమెకు వరుసగా అవకాశాలొస్తున్నాయి. బడా స్టార్ హీరోలు కూడా ఈమెతో సినిమాలు నిర్మించడానికీ రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా మృణాల్ మాత్రం ఆచి తూచి కథలను ఎంచుకుంటుందని సమాచారం.
End of Article