జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్టుల్లో ఒకరు అవినాష్. అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇటీవలే తను ఒక ఇంటివాడిని అవ్వబోతున్నట్టు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. గత వారం లో అవినాష్, తనకు కాబోయే శ్రీమతి అనుజ‌ లు కుటుంబ సభ్యుల మధ్య ఇద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.

mukku-avinash-engagment

mukku-avinash-engagment

అయితే వీరి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోస్ ఎక్కడ ఎక్కువ కనపడలేదు. ఇటీవల అవినాష్ అనుజ ల ఎంగేజ్మెంట్ వీడియో ఒకటి అభిమానులతో షేర్ చేసుకున్నాడు అవినాష్. ‘జత కలిసే’ అంటూ యూట్యూబ్ లో పెట్టిన ఈ వీడియో కి ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నిశ్చితార్థం లో కుటుంబ సభ్యుల మధ్య తీసిన ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది. మొత్తానికి తన ఫాన్స్ కి వీడియో ద్వారా తనకు కాబోయే శ్రీమతి గురించి అందరికి పరిచయం చేసాడు అవినాష్.

ఇప్ప్పటికే ఈ వీడియో సోషల్ మీడియా లో చాల వైరల్ అయింది. బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా అవినాష్ పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ రూల్స్ ప్రకారం నిర్వాహకులకు ఎదురు డబ్బు ఇచ్చి మరీ బయటకి వచ్చిన వార్త అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.