Ads
సినిమాల్లో కొన్ని పాత్రలకి సరిగ్గా ఆ నటులే సరిపోతారు అని దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఒక్కోసారి ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఆ పాత్రకి వారు మాత్రమే సరైన న్యాయం చేయగలరు అని భావిస్తారు. అందుకోసం ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా వెనుకాడరు. సరిగ్గా ఇలాంటి సంఘటనే అతడు మూవీ షూటింగ్ సమయం లో జరిగిందట.
Video Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “అతడు” సినిమా వచ్చి ఇప్పటికి పదహారేళ్లు అయ్యింది. ఈ సినిమాను ఎన్ని సార్లు చూసి ఉంటామో ఓ లెక్క కూడా ఉండదు. ఈ సినిమాలో అన్ని పాత్రలకి ఎదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంది. అలాగే.. తాతగారి పాత్రలో నటించిన నాజర్ పాత్రకి కూడా. అసలు నాజర్ నటించిన ఈ పాత్రకు తొలుత శోభన్ బాబు ని అనుకున్నారట.
దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత మురళి మోహన్ లు ఈ పాత్రకి శోభన్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నారట. అందుకోసం ఆయనను వ్యక్తిగతం గా సంప్రదించారట కూడా. ఈ పాత్రలో నటించడం కోసం శోభన్ బాబు కు బ్లాంక్ చెక్ ను ఇస్తానని మురళి మోహన్ ఆఫర్ చేశారట. అయితే.. అందుకు శోభన్ బాబు మాత్రం తిరస్కరించారట. ప్రేక్షకుల దృష్టిలో అందగాడిలా గుర్తుండిపోయానని.. ముసలి పాత్రలో నటించడం ఇష్టం లేదని చెప్పి శోభన్ బాబు ఈ పాత్రను తిరస్కరించారట.
End of Article