Ads
మహేష్ బాబు కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసి బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసిన సినిమా మురారి. 2001 ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్ ని అందుకుంటుంది. ఈ సినిమా లో మహేష్ బాబు నటవిశ్వరూపం చూసి విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మురారి సినిమా ఎలా పుట్టిందో,దాని వెనుక ఉన్న విశేషాలు ఏమిటో కృష్ణవంశీ మాటల్లోనే తెలుసుకుందాం.
Video Advertisement
ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ కృష్ణవంశీ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ప్రతిసారి ఒక మనిషి విలన్ గా ఉంటున్నాడు, అయితే ఏదైనా ఒక ఫోర్సుని ఎదుర్కొనే లాగా ఉండాలని కధ రాయటం జరిగింది. ఒక దేవత కోపం వల్ల శాపగ్రస్తులైతే పరిస్థితి ఏంటి.. చివరికి హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందులోనే మన సాంప్రదాయం, కుటుంబం, ప్రేమానురాగాలు కలిపి ఈ సినిమాలో చూపించాలి అనుకున్నాను.
అంతా ఓకే కానీ క్లైమాక్స్ విషయంలో చర్చలు గట్టిగా జరిగాయి. సినిమాలో అలనాటి రామచంద్రుడి పాట ఎంతగా హిట్ అయిందో చెప్పనవసరం లేదు. ప్రతి పెళ్లిలోనూ ఆ పాట వినిపిస్తూ వుంటుంది. అయితే ఈ సాంగ్ చివరిలో వద్దని అందరూ వారించారు. కమర్షియల్ గా ఏదైనా మాస్ సాంగ్ ఉండాలని అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు మహేష్ బాబు కూడా మొహమాటం కొద్ది ఊరుకున్నాడు.
కానీ పంచాయతీ కృష్ణ గారి వరకు వెళ్లడంతో ఆయనని కలవవలసి వచ్చింది. అప్పుడు కృష్ణ గారు చివరిలో మాస్ సాంగ్ లేకపోతే ఎలా? అనవసరంగా ప్రయోగం చేయడం అవసరమా అని అడిగారు. కానీ ఆయనను కూడా ఒప్పించి కమర్షియల్ సాంగ్ కాకుండా అలనాటి రామచంద్రుడి సాంగ్ పెట్టి సినిమా రిలీజ్ చేశాను. సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఎంత హిట్ అయిందో ఆ సాంగ్ అంతకుమించి హిట్ అయింది అంటూ అలనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు కృష్ణవంశీ.
End of Article