“ప్రభాస్” ఫ్యాన్ అడిగిన ప్రశ్నకి వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ రిప్లై..!

“ప్రభాస్” ఫ్యాన్ అడిగిన ప్రశ్నకి వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ రిప్లై..!

by Mohana Priya

Ads

ప్రభాస్ ఇప్పుడో పాన్ ఇండియన్ స్టార్. బాహుబలి తర్వాత ఆయన సినిమా ఎప్పుడో తెలుగు తెర దాటిపోయింది. కాగా వరుసగా ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన ప్రభాస్ సినిమాల కోసం ఫాన్స్ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహూ , రాధేశ్యామ్ అభిమానులను, ప్రేక్షకులను కాస్త నిరాశపరచాయి.

Video Advertisement

ఓం రావత్ తో చేస్తున్న ఆదిపురుష్ పై పెద్దగా అంచనాలేమి లేవు. కాగా ఇక అందరి ఎదురుచూపులు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సాలార్ మీదనే.ఇక ప్రభాస్ తర్వాత మూవీ ‘ప్రాజెక్ట్ K’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమా గా తెరక్కెక్కుతున్న ఈ సినిమా మీదనే అటు ఫాన్స్ ఇటు ఆడియన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

Prabhas Nag Ashwin

Prabhas Nag Ashwin

మహానటి తో నాగ్ అశ్విన్ కి మంచి పేరు రావడం. సినిమా అనౌన్స్ చేసిన రోజు ఇదొక పాన్ వరల్డ్ కాన్సెప్ట్ అని చిత్ర యూనిట్ చెప్పడంతో అంచనాలు మరీ ఎక్కువయ్యాయి.అయితే ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ప్రభాస్ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ చాలా సిగ్గరి.

సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండడు. అతడి సినిమా అప్డేట్స్ చిత్ర యూనిట్ ఇస్తే తప్ప ఫాన్స్ కు తెలియవు. అందుకే ఉండబట్ట లేక ప్రభాస్ ఫ్యాన్ ఒకరు ట్విట్టర్ వేదికగానే నాగ్ అశ్విన్ ని “మేము గుర్తున్నామా?” అంటూ అడిగేశాడు. దానికి డైరెక్టర్ సున్నితంగా “గుర్తున్నారు. ఇప్పుడే ఒక షెడ్యూల్ అయ్యిందంటూ” సున్నితంగా రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ రిప్లై నే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Also read: 

బాలకృష్ణ “లెజెండ్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..? 

“సర్కారు వారి పాట” సక్సెస్‌ మీట్‌లో “మహేష్ బాబు” డాన్స్ వేయడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!


End of Article

You may also like