అయిపోయిన విషయాన్ని ఇంకా సాగదీస్తున్నారంటూ.. “నాగచైతన్య” కామెంట్స్..

అయిపోయిన విషయాన్ని ఇంకా సాగదీస్తున్నారంటూ.. “నాగచైతన్య” కామెంట్స్..

by kavitha

Ads

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి రెండు సంవత్సరాలు కావోస్తుంది. 2021లో ఈ జంట విడిపోయారు. తామిద్దరు విడాకులు తీసుకున్నామని, చై అండ్ సామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Video Advertisement

అయితే నాగచైతన్య, సమంత ఎక్కడికి వెళ్లిన విడాకుల గురించి ప్రశ్నలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. వీరి గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల పై స్పందించారు. అయితే నాగచైతన్య ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
నాలుగేళ్లకి పైగా ప్రేమించుకున్న తర్వాత 2017లో ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.  2021లో ఈ జంట విడాకులు తీసుకుని, విడిపోయారు. నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుండి ఇద్దరి పర్సనల్ విషయాల గురించి తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు  కొడుతున్నాయి. ఇక డివోర్స్ గురించి చైతూ, సామ్ లకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నయి. ఈ క్రమంలో  కస్టడీ ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల పై స్పందించారు.
తమ డివోర్స్ అయిపోయిందని, ఇద్దరం ఒకేసారి సోషల్ మీడియాలో ప్రకటించామని, ఇది ముగిసిపోయిందని, ఇంకా ఈ విషయాన్ని ఎందుకు సాగదీస్తున్నారో తనకు అర్థం కావట్లేదని చెప్పారు. అయిన కొంతమంది తమ న్యూస్ హెడ్ లైన్స్ కోసం ఇలా సాగదీయడం చాలా తప్పు అని చెప్పుకొచ్చారు. కొత్త చిత్రాలు రిలీజ్ అయిన శుక్రవారం రోజే  అంతా డిసైడ్ అయిపోతుందని అన్నారు. అలాగే తన చిత్రాలు రిలీజ్ అయినపుడు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్, రేటింగ్స్ చూస్తానని అన్నారు.
ఆ కామెంట్స్ చూస్తే కొన్నిసార్లు ఎందుకు ఇంకా బ్రతుకున్నామో అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆడియెన్స్ వైపు నుండి కూడా ఆలోచిస్తానని చెప్పారు. ఇక నాగచైతన్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కోలీవుడ్  దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కస్టడీ చిత్రం పై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12న విడుదల చేయనున్నారు.

Also Read: “నాగచైతన్య” నటించిన “కస్టడీ” మూవీ సెన్సార్ టాక్..!! మూవీ ఎలా ఉందంటే..??


End of Article

You may also like