నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ భాషలో కూడా రూపొందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

  • చిత్రం : కస్టడీ
  • నటీనటులు : నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి.
  • నిర్మాత : శ్రీనివాస చిత్తూరి
  • దర్శకత్వం : వెంకట్ ప్రభు
  • సంగీతం : ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
  • విడుదల తేదీ : మే 12, 2023

custody movie break even target..!!

స్టోరీ :

సినిమా రాజమండ్రిలో మొదలవుతుంది. సినిమా అంతా కూడా 1990 సమయంలో జరుగుతుంది. శివ (నాగ చైతన్య) అనే ఒక కానిస్టేబుల్ ఒక సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. శివ రేవతి (కృతి శెట్టి) ని ప్రేమిస్తాడు. అయితే వారిద్దరి ప్రేమకి కుటుంబాలు అడ్డం పడతాయి. దాంతో శివ ఈ సమస్యలు పరిష్కరించుకోవాలి అనుకుంటాడు.

custody movie review

అయితే అనుకోకుండా రాజు (అరవింద్ స్వామి) అనే ఒక క్రిమినల్ తో శివ కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు శివ ఏం చేశాడు? శివ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీటన్నిటి మధ్యలోకి రేవతి ఎలా వచ్చింది? చివరికి రాజుని శివ పోలీసులకి అప్పగించాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

custody movie break even target..!!

రివ్యూ :

కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని ఎక్కువగా ఎంచుకుంటూ, అలాగే కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ నాగ చైతన్య. అయితే నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నా కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఇప్పుడు కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

custody movie review

ఇంక సినిమా విషయానికి వస్తే, దర్శకుడు వెంకట్ ప్రభు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా వెళ్ళిపోతుంది. అసలు చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ మొత్తంలో కూడా ఎక్కడ ఒక్కచోట హై అనిపించే సీన్ ఉండదు. అలా వెళ్ళిపోతుంది అంతే. అలా అని ఎంటర్టైనింగ్ గా కూడా అనిపించదు. చాలా మామూలుగా ఉంటుంది. ఒక్క సారి రాజు క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత, అలాగే సంపత్ రాజ్ పోషించిన సిబిఐ ఆఫీసర్ పాత్ర వచ్చిన తర్వాత సినిమా కథ కొంచెం ఫాస్ట్ అవుతుంది.

custody movie review

సినిమాలో చేజింగ్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. కానీ అవి ఇంకా కొంచెం బాగా తీసి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమా ఇంటర్వెల్ కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇందులో యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అసలు సినిమా 1990 సమయంలో ఉన్నట్టు ఎందుకు తీశారు అనేది మాత్రం అర్థం కాదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సమయానికి తగ్గట్టు తీసినా ఒకేలాగా ఉండేది.

custody movie review

అప్పటి సమయానికి తగ్గట్టుగా తీసినా కూడా పెద్దగా కొత్తదనం ఏమీ అనిపించలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగ చైతన్య ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించారు. సినిమా పరంగా చూసుకోకుండా, పాత్ర పరంగా చూసుకుంటే నాగ చైతన్య ఈ సినిమాతో కచ్చితంగా నటుడిగా ముందుకి వెళ్లారు. తను ప్రేమించిన అమ్మాయిని కాపాడాలి అని, అలాగే సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అని అటు భయపడుతూనే ఇటు ధైర్యం చూపించే శివ పాత్రలో నాగ చైతన్య బాగా నటించారు.

custody movie review

సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. విలన్ రాజు పాత్రలో నటించిన అరవింద్ స్వామి కూడా తన పాత్రలో బాగా నటించారు. హీరోయిన్ కృతి శెట్టి కి పెద్దగా పెర్ఫార్మన్స్ విషయంలో చెప్పుకోదగ్గ పాత్ర ఏమి కాదు. శరత్ కుమార్ కూడా తన పాత్రకి తగ్గట్టుగా నటించారు. ప్రియమణి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. కానీ అంత ముఖ్యమైన పాత్ర పోషించిన నటిని కేవలం కొన్ని సీన్లకు మాత్రమే పరిమితం చేయడం అనేది అర్థం కాని విషయం.

custody movie review

అంత మంచి నటిని అంత ఇంపార్టెంట్ పాత్రకి తీసుకొని తెరపై బాగా చూపించలేకపోయారు అనిపిస్తుంది. సంపత్ కూడా అంతే. ఆయన పోషించిన పాత్ర సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర. కానీ తెరపై చూపించే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. పాటలు అటు చాలా బాగున్నాయి అని చెప్పలేం. ఇటు బాగాలేదు అని చెప్పలేం. అలా వెళ్ళిపోతాయి అంతే. సినిమాలో చూపించిన ప్రేమ కథ కూడా ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నాగ చైతన్య
  • కొన్ని యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • బలహీనమైన స్క్రీన్ ప్లే
  • సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
  • హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ప్రేమ కథ
  • ముఖ్యమైన పాత్రలకి ప్రాముఖ్యత లేకపోవడం

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, నాగ చైతన్య కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి, టేకింగ్ ఎలా ఉన్నా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి సినిమా చూద్దాం అనుకునే వారికి కష్టడి సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :