Ads
జోష్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అక్కినేని నాగచైతన్య నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులకి చేరువయ్యాడు. అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి తనదైన నటనతో గుర్తింపును, క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
Video Advertisement
నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ సినిమా మే 12 న విడుదల కానుంది. చై ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పరశురామ్ మూవీ గురించి అడుగగా, చైతన్య ఇచ్చిన
జవాబుతో అది ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రకటించి ఆగిపోయిన నాగచైతన్య సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. గౌరవం:
నాగ చైతన్య, రాధామోహన్ డైరెక్షన్ లో ‘గౌరవం’ అనే సినిమాని ప్రకటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూవీ ఆగిపోయింది. ఈ సినిమాలో నాగచైతన్య జంటగా వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
2. హలో బ్రదర్:
నాగ చైతన్య, ఢమరుఖం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ‘హలో బ్రదర్’ మూవీ రీమేక్ ని ప్రకటించారు. కానీ ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది.
3. దుర్గ:
‘హలో బ్రదర్ ‘ రీమేక్ ఆగిపోవడంతో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దుర్గ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీలో హన్సిక మోత్వాని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాత. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది.
4. అదే నువ్వు అదే నేను:
దిల్ రాజు నిర్మాణంలో కొత్త డైరెక్టర్ శశి దర్శకత్వంలో నాగ చైతన్య, రష్మిక మందన్నహీరోహీరోయిన్లుగా ‘అదే నువ్వు అదే నేను’ అనే సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం కూడా ఆగిపోయింది. రష్మిక నాగ చైతన్యతో నటించడానికి రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం, నాగ చైతన్య కథలో కొన్ని మార్పులు చేయమనడంతో ఈ సినిమా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
5. నాగ చైతన్య – ఇంద్రగంటి చిత్రం :
అక్కినేని నాగ చైతన్య మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక చిత్రం ప్రకటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ప్రకటంతోనే ఆగిపోయింది. దీనికి కారణం ఆ ఏడాది చైతన్య కాల్ షీట్స్ లేకపోవడంతో ఆ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టారని సమాచారం.
6. నాగేశ్వరరావు :
నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్ లో ‘నాగేశ్వరరావు’ అనే సినిమాను ప్రకటించారు. అయితే దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టి, మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ మూవీని తీశాడు. ఆ తరువాత నాగ చైతన్యతో మూవీ వస్తుంది అని అనుకున్నారు. కానీ దాని గురించి ఎలాంటి వార్త లేదు. తాజాగా చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయం అడుగగా ఆ విషయం మాట్లాడుకోవడం టైమ్ వెస్ట్ అని అన్నారు.
Also Read: మన 2 తెలుగు రాష్ట్రాలలో “ఆదిపురుష్” ట్రైలర్ రిలీజ్ అవుతున్న థియేటర్స్ ఇవే..! ట్రైలర్ కే ఇంత భారీగా ప్లాన్ చేశారా..?
End of Article