Ads
లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల తర్వాత నాగ చైతన్య మళ్లీ థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు ముఖ్య కారణం నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబినేషన్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మనం సినిమాలో నటించారు.
Video Advertisement
ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వీరిద్దరూ మళ్లీ కలిసి ఈ సినిమా చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా కొత్తగా అనిపించాయి. నాగ చైతన్య ఈ సినిమాలో మూడు రకమైన పాత్రల్లో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఈ సినిమాలో మాళవిక నాయర్, అవికా గోర్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అభిరామ్ అనే ఒక వ్యక్తి ఒక మామూలు మనిషి నుండి ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు అనే విషయం చుట్టూ సినిమా నడుస్తుంది. అభిరామ్ తను అంత సక్సెస్ అవ్వడానికి, అంత పెద్ద స్థాయికి ఎదగడానికి తానే కారణం అని అనుకుంటూ ఉంటాడు.
అయితే అభిరామ్ జీవితంలో అనుకోని ఒక సంఘటన కారణంగా తను అనుకున్న వారిని కోల్పోతాడు. అప్పుడు అభిరామ్ తను ఎక్కడినుంచి మొదలుపెట్టాడు అని గుర్తు చేసుకొని నిజంగా తను ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి కారణం తాను మాత్రమే కాదు అని, ఇంకా చాలా మంది ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. అసలు అభిరామ్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? అభిరామ్ కి సహాయం చేసిన వారు ఎవరు? అభిరామ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారు ఎవరు? చివరికి తన గెలుపు వెనుక ఉన్న అర్ధాన్ని తెలుసుకున్నాడా అనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా తిరుగుతుంది అని సమాచారం.
అయితే సినిమాకి వచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమా ఈ అబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ మాత్రం నాగ చైతన్య నటన అని అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఫీల్ గుడ్ సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది కాబట్టి ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
End of Article