Phalana Abbayi Phalana Ammayi Review : “నాగ శౌర్య, మాళవిక నాయర్” నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Phalana Abbayi Phalana Ammayi Review : “నాగ శౌర్య, మాళవిక నాయర్” నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
  • నటీనటులు : నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి.
  • నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
  • దర్శకత్వం : శ్రీనివాస్ అవసరాల
  • సంగీతం : కళ్యాణి మాలిక్
  • విడుదల తేదీ : 17 మార్చ్, 2023

phalana abbayi phalana ammayi movie review

Video Advertisement

స్టోరీ :

సినిమా మొత్తం ఇద్దరు ప్రేమికుల మధ్య తిరుగుతుంది. సంజయ్ (నాగశౌర్య), అనుపమ (మాళవిక నాయర్) చదువుకునే సమయంలో పరిచయం అవుతారు. తర్వాత వారిద్దరి ప్రేమ ఎలా సాగింది? వాళ్ళకి మధ్యలో గొడవలు ఎందుకు వచ్చాయి? తర్వాత వారి జీవితాల్లోకి వేరే వ్యక్తులు ఎందుకు వచ్చారు? వీళ్ళిద్దరి ప్రేమ కథలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

phalana abbayi phalana ammayi movie review

రివ్యూ :

నటుడిగా ఎన్నో పాత్రలు పోషించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ శ్రీనివాస్ అవసరాల. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకున్నారు. ఆ తర్వాత జో అచ్యుతానంద సినిమాకి దర్శకత్వం వహించారు. మళ్లీ ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

phalana abbayi phalana ammayi movie review

సినిమా కథ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూస్తున్నాం అని అనిపిస్తుంది. వాళ్ల సంభాషణలు కూడా భారీగా లేకుండా నిజ జీవితంలో ఎలా మాట్లాడుకుంటారో అలాగే ఉంటాయి. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. ఇద్దరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.

phalana abbayi phalana ammayi movie review

అలాగే సినిమాలో ఉన్న మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. సినిమాకి మరొక ప్రధాన హైలైట్ కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం. పాటలు వినడానికి చాలా బాగున్నాయి. అలాగే చూడడానికి కూడా అంతే బాగున్నాయి. కానీ సినిమా అలా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది కాబట్టి మధ్యలో కొన్ని చోట్ల కొంచెం స్పీడ్ తగ్గినట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • కామెడీ
  • పాటలు
  • హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
  • అక్కడక్కడ ల్యాగ్ అయిన కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ప్రేమ కథలు ఇష్టపడే వారిని, అలాగే ఎక్కువ ట్విస్ట్ లు లేకుండా అలా సరదాగా సాగిపోయే సినిమా చూద్దాం అనుకునే వారిని ఈ సినిమా అస్సలు నిరాశ పరచదు. ఇటీవల కాలంలో వచ్చిన ప్రేమ కథల్లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like