నాగశౌర్య గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన సౌర్య ఒక ఇంటి వాడయ్యాడు. నాగశౌర్య పెళ్లి ఈ నెల 20వ తేదీన అనూష ఎన్ శెట్టి తో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

Video Advertisement

కర్ణాటక లోని ఒక పెద్ద ఇంటీరియర్ కంపెనీకి యజమాని ఆమె. అనూష డిజైన్స్ అనే పేరుతో ఈమె ఇంటీరియర్ కంపెనీని రన్ చేస్తోంది.

ఇంటీరియర్ డిజైనింగ్ సేవలను ఈ కంపెనీ అందిస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కొంత కాలం నుండి కూడా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు వీరు పెళ్లి చేసుకున్నారు. అనూష ఆర్కిటెక్ గా కర్ణాటక స్టేట్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. మొదట శౌర్య, అనూష ఇద్దరూ కూడా మంచి స్నేహితులు.ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు. వీళ్ళ పెళ్లి విటల్ మాల్యా రోడ్డులోని జె డబ్ల్యు మారియట్ హోటల్లో జరిగింది. నాగ సౌర్య పెళ్లి భోజనాలకి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

రాచరికపు స్టైల్ లో భోజనాలను సౌర్య పెండ్లికి పెట్టారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో భోజనాలను వడ్డించారు. పన్నెండు రకాల వంటకాలను నాలుగు రకాల స్వీట్స్ ని వడ్డించారట. హైదరాబాద్ లో త్వరలో రిసెప్షన్ చేస్తారు. ఇదిలా ఉంటే సౌర్య ప్రస్తుతం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారి నారి నడుమ మురారి’, ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే సినిమాలు చేస్తున్నాడు సౌర్య.