Ads
ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అయిన సమంత, నాగ చైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇటు అభిమానులు, అటు సినీ తారలు సైతం విడాకులు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు.
Video Advertisement
విడాకుల తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నాగచైతన్య కూడా వరుస ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటూ షూటింగ్ లతో బిజీ అయిపోయారు. ఇక వెబ్ సిరీస్ లను కూడా ఒప్పుకుంటున్నారు.
మరోవైపు కేవలం హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. తనను తాను బిజీ గా ఉంచుకుంటున్న నాగ చైతన్య తాజాగా తండ్రి బాటలోనే నడవనున్నారు. తండ్రి నాగార్జున లాగానే కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. వ్యాపార రంగంలో దూసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
గతంలో అక్కినేని ఫ్యామిలీ “ఎన్ గ్రిల్” అనే రెస్టారెంట్ ను నడిపేది.. అయితే అనుకోని కారణాల వలన ఈ రెస్టారెంట్ మూత పడింది. తాజాగా.. తండ్రి బాటలోనే తనయుడు నాగ చైతన్య కూడా ఫుడ్ బిజినెస్ లో రాణించాలని భావిస్తున్నారు. “షో యు” పేరుతొ నాగచైతన్య కొత్త రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఆసియా ఖండంలో దొరికే మంచి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఈ రెస్టారెంట్ లో దొరుకుతాయట. ఈ విషయాన్నీ ఇటీవలే నాగచైతన్య ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, బన్నీ, సందీప్ కిషన్ లు సినిమాలే కాకుండా.. వ్యాపారంలోను అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
End of Article