DHOOTHA REVIEW: నాగచైతన్య నటించిన “దూత” వెబ్ సిరీస్ ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

DHOOTHA REVIEW: నాగచైతన్య నటించిన “దూత” వెబ్ సిరీస్ ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mounika Singaluri

Ads

అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య మొదటిసారి దూతా వెబ్ సిరీస్ తో ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకునే నాగచైతన్య దూతతో ఒక కొత్త ప్రయోగాన్ని చేశాడని చెప్పాలి. నాగచైతన్యతో మనం, థాంక్యూ మూవీలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఈ దూత వెబ్ సిరీస్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో స్టీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ఆకట్టుకుందో లేదో చూద్దాం…!

Video Advertisement

చిత్రం: దూత
నటీనటులు: నాగచైతన్య, ప్రియా భవాని శంకర్, పార్వతి తిరువోతూ, తరుణ్ భాస్కర్, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు.
దర్శకుడు: విక్రమ్ కె కుమార్
నిర్మాత:శరత్ మారార్
సంగీతం: ఇషాన్ చాబ్రా
సినిమాటోగ్రఫీ: మికోలాజ్ సైగులా
విడుదల తేదీ:డిసెంబర్ 1

కథ:
సాగర్ (నాగచైతన్య) మొదట జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం సమాచార్ పత్రికకు చీఫ్ ఎడిటర్ గా ఎదుగుతాడు. దీంతో సాగర్ చాలా ఉప్పొంగిపోతాడు. అయితే తన జీవితంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో అతని ఆనందం ఎక్కువ కాలం నిలవదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని వార్తాపత్రికలు క్లిప్పింగ్ లు ఈ విషాదాలను ముందుగానే అంచనా వేస్తాయి. మరి అది ఎలా సాధ్యమైంది, సాగర్ కి తన ప్రొఫెషన్ లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? మరి చివరిగా ఆ వార్తాపత్రికలు వెనుక రహస్యాన్ని సాగర్ ఎలా చేదించగలిగాడు? అనేది దూత వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
దర్శకుడు విక్రమ్ కె కుమార్ సినిమాలు చూస్తే ఒక చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూరు కథనం అల్లి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాడు. దూత కథ ఏమిటనేది అయిదారు ఎపిసోడ్ ల తర్వాత గాని క్లారిటీ రాదు.అప్పటివరకు కథ గురించి ఆలోచించే అవకాశాన్ని ప్రేక్షకులకు డైరెక్టర్ ఇవ్వలేదు. ఏదో ఒక మ్యాజిక్ చేస్తూ ముందుకు వెళ్లాడు. మొదటి ఎపిసోడ్ లో కాసేపటికి కథలోకి వెళ్ళాడు. కళ్ళ ముందు కనిపించే పాత్రలతో ప్రయాణం చేసేలా చేశారు. ఫ్లాష్ బ్యాక్ వచ్చేవరకు ఉత్కంఠను కంటిన్యూ చేశారు. దూతలో దెయ్యం లేదు కానీ కంటికి కనిపించని అతీంద్రియ శక్తి ఉందని చెప్పారు. రెగ్యులర్ హర్రర్ నేపథ్యంలో సంగీతంతో భయపట్టే ప్రయత్నం చేయలేదు కానీ కంటికి కనిపించని పాత్రలను ఫీలయ్యేలా చేశారు.

చిన్న చిన్న చమక్కులతో, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. కొన్ని సీన్లలో విక్రమ్ డీటెయిల్ సామాన్య ప్రేక్షకులను సైతం గమనించేలా ఉంటుంది.ఐదారు ఎపిసోడ్లు వరకు సస్పెన్షన్ మెయింటైన్ చేసి తర్వాత కథను ముగింపు దశకు తీసుకురావడానికి డైరెక్టర్ చాలా స్వేచ్ఛ తీసుకున్నాడు. క్యారెక్టర్ లను కనెక్ట్ చేసిన విధానం కాస్త సినిమాటిక్ టైప్ లో ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నుంచి 50 నిమిషాల మధ్య ఉండడం కూడా కాస్త మైనస్ అని చెప్పాలి. ఈ దూత సీరీస్ చూస్తునంత సేపు విక్రమ్ కుమార్ తీసిన 13B ఛాయలు కనిపిస్తాయి. మీడియాలో అవినీతి కొత్త కాదు కానీ దాన్ని ప్రధాన అంశంగా తీసుకున్న డైరెక్టర్ క్లాస్ పీక లేదు. జర్నలిజం, రాజకీయం, పోలీసు వ్యవస్థల్లో ఉన్న మంచి చెడులను చూపించారు.


ఇక టెక్నికల్ గా చూసుకుంటే దూత ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. సంగీతం కూడా కథకి తగ్గట్టుగా ఉంది.నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక నటీనటుల విషయానికొస్తే నాగచైతన్యది పాజిటివ్ రోల్ అని చెప్పలేము, అలాగని నెగిటివ్ కూడా కాదు. గ్రేషేడ్స్ ఉన్నాయి.యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉంది. లుక్స్ నుంచి ఎక్స్ప్రెషన్ వరకు చైతన్య ఇంప్రెస్ చేశాడు. పార్వతి నటన ఆకట్టుకుంటుంది, ఎస్పీ క్రాంతి గా ఒదిగిపోయింది. మిగతా పాత్రలు పరిమితమే కానీ ఉన్నంతలో బాగా నటించారు. ఇతర సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా కొన్నిచోట్ల ఆశ్చర్యపరుస్తారు.

రేటింగ్: 3/5

ఫైనల్ గా : దూత మొదలైన 15 నిమిషాల్లో ఆ ప్రపంచంలోకి ప్రేక్షకులు వెళతారు. థ్రిల్లర్ జానర్ ఫిలిమ్స్ ను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇది మంచి ఆప్షన్. నిడివి కాస్త ఎక్కువైనా కూడా డీసెంట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది.

 

Watch Trailer:


End of Article

You may also like