Ads
Tollywood: అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నటు తెలుస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అంటే నాగార్జున మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో నాగార్జున కూడా అదే బాటలో వెళ్తున్నారని సమాచారం.
Video Advertisement
టాలీవుడ్ హీరోల్లో అక్కినేని నాగార్జున న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందు వరుసలో ఉంటారు.నాగార్జున రాబోయే సినిమాతో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే మూడేళ్ల క్రితం విడుదలైన మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఆ సినిమానే పోరింజు మరియం జోస్. ఈ మూవీకి బెజవాడ ప్రసన్న కుమార్ రచయిత. సీనియర్ కథానాయకుడు అక్కినేని నాగార్జున ఓ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పటివరకు చాలా మంది కొత్త దర్శకులను, టెక్నీషియన్స్‌ని పరిచయం చేసిన ఘనత నాగార్జునకే సొంతం అని చెప్పవచ్చు. కొత్త టాలెంట్‌ను గుర్తించి మరి, వారిని ఎంకరేజ్ చేసి, వారితో హిట్ సినిమాలు చేయటం అగ్ర హీరోల్లో నాగార్జునకే చెల్లుతుందనే టాక్ ఇప్పటికే ఉంది. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతునట్టుగా ఫిలిమ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నాగార్జున ఇటీవలే వచ్చిన తన చిత్రం ‘ది ఘోస్ట్’ పై చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం పొందలేదు. దీంతో నాగార్జున కొంచెం గ్యాప్ ఇచ్చి, కొత్త కథలు వింటున్నారు. అయితే వీటిలో ఆయనకు ఓ కథ బాగా నచ్చిందంట. ఇంతకీ ఆ కథ రాసింది ఎవరో కాదు. నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ధమాకా చిత్రాల రచయిత బెజవాడ ప్రసన్నకుమార్. అయితే నాగార్జున ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది బాగా ఆలోచించారట, మరి వేరే దర్శకుడు ఎందుకు అనుకున్నారేమో కానీ, ఫైనల్ గా రైటర్ ప్రసన్నకుమార్‌నే ఈ సినిమాకు దర్శకుడిగా చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.
ప్రసన్నకుమార్ చాలా కాలంగా దర్శకత్వం వహించాలని ఎదురు చూస్తున్నాడు. అందులోనూ నాగార్జున అంతటి హీరోని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఎలా వదులుకుంటాడు, ఓకే చెప్పేశాడట. నాగార్జున చేయబోతున్న మలయాళ రీమేక్ 2019లో విడుదలైన పొరింజు మరియం జోస్‌ను ప్రసన్నకుమార్ మన తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి వినిపించడంతో కథ ఆయనకు నచ్చేసింది. ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. అయితే త్వరలోనే దీనికి అధికారిక ప్రకటన విడుదలకానుంది.
End of Article