దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ఇటీవల ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీ విజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు.

Video Advertisement

3వ రన్నరప్ గా శ్రీ రామ చంద్ర నిలవగా, 2వ రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ 6వ సీజన్ మొదలవుతుంది అని నాగార్జున ముందే చెప్పారు. చెప్పినట్టే ఈ సీజన్ ఫిబ్రవరిలో మొదలవ్వబోతోంది. అయితే ఇది టీవీలో కాకుండా ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది. అలాగే వీరిలో గత సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఉంటారు.

ఈ ప్రోమో కూడా ఇటీవలే విడుదలయ్యింది. ఇందులో నాగార్జునతో పాటు వెన్నెల కిషోర్, మురళీ కృష్ణ కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ సారి ప్రోగ్రాంలో అంతకు ముందు పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా పాల్గొంటారు. వారిలో గీత మాధురి, తనీష్, హరితేజ, అరియానా గ్లోరీ, ముమైత్ ఖాన్, ఆదర్శ్ బాలకృష్ణ, యాంకర్ శివ ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ కోసం దీప్తి సునైనాని కూడా సంప్రదించినట్లు సమాచారం. కంటెస్టెంట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించరు అనేది సమాచారం.

bigg boss telugu 5 finale

మామూలుగా హిందీలో అయితే ఈ సీజన్ కి కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించారు. తెలుగులో కూడా వేరే హోస్ట్ ఉంటారు. ఈ స్థానంలో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారే మొదటి సీజన్ విజేత అయిన శివ బాలాజీ, అలాగే మొదటి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అలరించిన నవదీప్. వీరిద్దరిలో ఎవరు హోస్ట్ గా వ్యవహరించినా కూడా షో సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ఈ షో మరికొద్ది రోజుల్లో మొదలవుతుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ క్వారంటైన్ లో ఉన్నారు.