Ads
ఈ మధ్యకాలంలో బుల్లితెరపై బాగా పాపులర్ అయిన షో బిగ్ బాస్. ప్రతి సీజన్ కి కొత్త మలుపులతో ప్రేక్షకులను అలరిస్తూ, సీజన్ సీజన్ కు అభిమానులను పెంచుకుంటూ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది, ఇప్పటికే బిగ్ బాస్ తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్ లను పూర్తి చేయడమే కాకుండా అదే ఊపులో సీజన్ సిక్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Video Advertisement
ఈ షో మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తదుపరి సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ సీజన్ మొదట్లో నాగార్జున హోస్ట్ గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని ఆయన స్థానంలో సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సమంత నాగ చైతన్య తో విడిపోవడం తో ఆమె ఈ షో కు హోస్ట్ గా వ్యహరిస్తారా అనే అనుమానం అందరికి కలిగింది.
కాగా ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారో అని అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్న తరణం లో తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా ఈ సీజన్ కు కూ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తేలి పోయింది.
Also read: బిగ్ బాస్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే
ఇకపోతే ఈ కార్యక్రమం కోసం నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత సీజన్ బిగ్ బాస్ 5 కోసం నాగార్జున ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. ఈ సీజన్ చేయడానికి నాగార్జున రెమ్యూనరేషన్ మరింత పెంచారని విశ్వసనీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సీజన్ కోసం ఏకంగా 14 నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ అడిగే అవకాశాలు ఉన్నాయన్న రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.
నాగార్జున రెమ్యూనరేషన్ గురించి ఈ విధంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ విషయంపై ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేదు. అయితే త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.ఇకపోతే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
End of Article