The Ghost Review : “నాగార్జున” నటించిన ది ఘోస్ట్ సినిమా హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

The Ghost Review : “నాగార్జున” నటించిన ది ఘోస్ట్ సినిమా హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : ది ఘోస్ట్
  • నటీనటులు : నాగార్జున అక్కినేని, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్.
  • నిర్మాత : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు (శ్రీ వెంకటేశ్వర సినిమాస్), శరత్ మరార్ (నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్)
  • దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
  • సంగీతం : భరత్ – సౌరభ్
  • విడుదల తేదీ : అక్టోబర్ 5, 2022

the ghost movie review

Video Advertisement

స్టోరీ :

విక్రమ్ (నాగార్జున) ఒక ఇంటర్ పోల్ ఆఫీసర్. అలాగే ప్రియ (సోనాల్ చౌహాన్) కూడా మరొక ఆఫీసర్. ఒక భారతీయ పిల్లాడిని ఉగ్రవాదులు దారుణంగా చంపేస్తారు. ఈ ఆపరేషన్ విక్రమ్ చేపడతాడు. కానీ ఇలా విఫలం అవడంతో విక్రమ్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆ తర్వాత ప్రియ ముంబైలో NCB లో చేరుతుంది. ఐదేళ్ల తర్వాత ఒకరోజు విక్రమ్ కి అను (గుల్ పనాగ్) నుండి ఫోన్ వస్తుంది.

the ghost movie review

తను సమస్యలను ఎదుర్కొంటోంది అని, తన కూతురిని ఎవరో చంపేస్తారు అని బెదిరిస్తున్నారు అని అను చెప్తుంది. అను కూతురిని కాపాడే బాధ్యతని విక్రమ్ తీసుకుంటాడు. అసలు విక్రమ్ కి అను ఏమవుతుంది? అను కూతురిని విక్రమ్ కాపాడగలిగాడా? మధ్యలో అండర్ వరల్డ్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? అయిదేళ్లపాటు దూరంగా ఉన్న ప్రియా, విక్రమ్ మళ్లీ కలిశారా? చివరికి విక్రమ్ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

the ghost movie review

రివ్యూ :

అటు కమర్షియల్ సినిమాలని, ఇటు ప్రయోగాత్మక సినిమాలని సమానంగా బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడు తాపత్రయపడే నటులలో నాగార్జున ఒకరు. ఏ రకమైన పాత్ర అయినా చేయగలను అని నాగర్జున ఇప్పటికే చాలా సినిమాలతో నిరూపించారు. సీనియర్ హీరో అయిన తర్వాత కూడా డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ, కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ, ఇప్పటికి కూడా ప్రయోగాత్మక సినిమాలు అంటే ముందు వరుసలో ఉంటున్నారు.

the ghost movie review

నాగార్జున ఆఫీసర్ పాత్ర పోషించడం కొత్త ఏమీ కాదు. కానీ ఈ సినిమాలో ఒక ఆఫీసర్ కి లవ్ స్టోరీ ఉండటం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ చూస్తే మనకి యాక్షన్ సినిమా అని అర్థం అయిపోయి ఉంటుంది. సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది. అలాగే దాని వెనకాల ఒక ఎమోషన్ కూడా ఉండేలాగా డైరెక్టర్ కథ రాసుకున్నారు. సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగార్జున ఈ సినిమాని నడిపించారు. ఈ సినిమా కోసం నాగార్జున ప్రత్యేక కత్తియుద్ధం కూడా నేర్చుకున్నారు.

the ghost movie review

ఒక మంచి కథ ఉంటే నాగార్జున ఎంత కష్ట పడతారు అనేది ఇది చూసి అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ గా నటించిన సోనాల్ చౌహాన్ పాత్ర బాగుంది. కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పలకలేదు ఏమో అనిపిస్తుంది. అలాగే మరొక ముఖ్య పాత్రలో నటించిన గుల్ పనాగ్ పాత్ర బాగున్నా కూడా ఎవరైనా తెలిసిన నటులని తీసుకొని ఉంటే ప్రేక్షకులకి పాత్ర ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదేమో అనిపిస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో అవి కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

  • నాగార్జున
  • మేకింగ్
  • ఎంచుకున్న స్టోరీ పాయింట్
  • కొన్ని యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో చాలా ఎక్కువగా ఉన్న యాక్షన్
  • సాగదీసినట్టు అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉన్న సినిమా ఇది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చూద్దాం, యాక్షన్ సినిమా చూద్దాం అని అనుకునేవారికి ది ఘోస్ట్ ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like