Ads
తెలుగు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగ శౌర్య. ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ శౌర్య, ఆ తర్వాత వచ్చిన ఛలో మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారాడు.
Video Advertisement
నాగ శౌర్య ప్రస్తుతం ‘రంగబలి’ అనే మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఒక అబ్బాయి అమ్మాయిని రవడూ పై ఏడిపిస్తే, అంతలా మీరు స్పందించాల్సిన పని ఏముంది. మీరు అబ్బాయిని కొట్టారా?’ అని అడిగారు. దానికి నాగశౌర్య ఏమని అన్నారో ఇప్పుడు చూద్దాం.. నాగ శౌర్య మాట్లాడుతూ ‘‘ఆ రోజు పనిమీద వెళ్తుండగా, కూకట్‌పల్లిలో రోడ్డు పైన ఓ అమ్మాయిని కొడుతున్న అబ్బాయి కనిపించాడు. దాంతో వెంటనే వారి వద్దకు వెళ్లి, ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నావు వెంటనే సారీ చెప్పమని అన్నాను. దానికి ఆ అమ్మాయి నా బాయ్‌ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు. మీకెందుకు అని అడిగింది. అమ్మాయి అలా మాట్లాడితే ఏం చేస్తాం.
కానీ నేను మాత్రం ఒకటే చెబుతున్నా, వివాహం చేసుకోవాలనుకునే అమ్మాయిలు, మిమ్మల్ని కొట్టేవాడిని పెళ్లి చేసుకోవద్దు. అది మీకు మరియు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. ఇక ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో నేను అబ్బాయిని కొట్టలేదు. మిస్టేక్ అబ్బాయిది కాదు. అమ్మాయిదే అని అన్నారు. మరో రూమర్ కూడా వచ్చింది. పబ్లిసిటీ కోసం అదంతా నేనే చేసినట్టు కొందరు చెప్పారు. అయితే వాళ్లిద్దరూ ఎవరో నాకు తెలియదని వెల్లడించారు.
నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘రంగబలి’ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి పవన్ బాసమ్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నటుడు షైన్ టామ్ చాకో విలన్ గా నటించాడు. ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సప్తగిరి నటించిన ఈ సినిమా జులై 7న రిలీజ్ కానుంది.
Also Read: మొదటి సినిమా రిలీజ్… కానీ అప్పుడే..? అసలు ఏం జరిగిందంటే..?
End of Article