Ads
నగ్మా.. ఈ పేరు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఒకప్పటి తార. తాను స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రోజుల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే.. ఈమె స్టార్ క్రికెటర్ గంగూలీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.
Video Advertisement
అప్పట్లో నగ్మా కెరీర్ పీక్స్ లో ఉండేది. అదే సమయంలో అటు గంగూలీ కూడా స్టార్ క్రికెటర్ గా ఫామ్ లో ఉన్నారు. ఇద్దరు కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో వాళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారట. ప్రస్తుతం నగ్మా 46 ఏళ్ల వయసులోనూ సింగిల్ గానే ఉంటున్నారు.
ఇటీవల ఆమె ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రిలేషన్ పై నోరు విప్పారు. సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైం గంగూలీ కూడా క్రికెటర్ గా మంచి ఫామ్ లో ఉన్నారని.. ఆ సమయంలో అడ్డొచ్చిన ఈగో కారణంగానే విడిపోయామని.. బంధం మధ్యలో అహం అడ్డొస్తే.. ఆ అనుబంధం ఎక్కువ కాలం కొనసాగదు కదా.. అంటూ ఆమె బదులిచ్చారు.
End of Article