నిర్భయ కేసులోని ఆ నలుగురు దోషులు జైలులో ఎంత సంపాదించారో తెలుసా?

నిర్భయ కేసులోని ఆ నలుగురు దోషులు జైలులో ఎంత సంపాదించారో తెలుసా?

by Sainath Gopi

Ads

భారతదేశం మాత్రం ఖచ్చితంగా కొద్దిగంటలు కరోనాని మర్చిపోయి, ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న నిర్భయ నిందితుల ఉరిశిక్షతో ఖచ్చితంగా హ్యాపిగా ఉంది . నలుగురు నరరూప రాక్షసులని ఒకేసారి ఉరితీసిన ఘటన చరిత్రలోనే మొదటిసారి .నిర్భయ దోషులకి మార్చి  20న  ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది ఢిల్లీ కోర్టు . ఆసియాలోనే అతిపెద్ద జైలు తీహార్లో వారిని ఉరితీయాలని నిర్ణయం. అందులో భాగంగానే ఉరిశిక్ష అమలు చేసే జైలు నెంబర్ 3కి దగ్గరలోకి జైలు అధికారులు వారిని తరలించారు .

Video Advertisement

ఉరి శిక్ష పడిన ఖైదీలు ముకేష్ సింగ్ , అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా , వినయ్ శర్మలకు ప్రతిరోజులాగే ఒకరితర్వాత ఒకరికి వేర్వేరుగా వైధ్య పరీక్షలు చేశారు. నలుగురూ వారి చివరి కోరిక చెప్పకపోవడం విశేషం, అంతేకాదు నలుగురిలో కూడా భయం కాని, బాధ కాని , పశ్చాత్తాపం కాని ఏ భావాలు కనిపించలేదు.వీలునామా రాసే అవకాశం ఉన్న వినియోగించుకోలేదు. కనీసం భోజనం కూడా చేయకుండా , రెండు సార్లు మంచినీళ్లు తాగి సరిపెట్టుకున్నారు.

అయితే ఈ నలుగురు దోషులు జైలులో ఉన్న రోజుల్లో ఎంత సంపాదించారో తెలుసా? సుమారు రూ. 1.37 లక్షలు సంపాదించారని జైలు వర్గాలు చెబుతున్నారు. అక్షయ్ కుమార్ రూ. 69 వేలు, పవన్ గుప్తా రూ. 29 వేలు, వినయ్ శర్మ రూ. 39 వేలు సంపాదించారు. దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ మాత్రం ఏ పని చేయలేదు. అందుకే అతను ఏం సంపాదించలేదు.


End of Article

You may also like