“బాలకృష్ణ” అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా..?

“బాలకృష్ణ” అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా..?

by kavitha

Tollywood: నటసింహం నందమూరి బాలకృష్ణ 107వ సినిమాలో నటిస్తూనే, ఇంకో వైపు 108వ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఇప్పటికే కథా చర్చలు జరిగాయి. అనిల్ రావిపూడి ఆర్టిస్ట్‌ల సెలెక్షన్ చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాలో ఇంతకుముందు బాలయ్యతో నటించిన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా, పెళ్లిసందD శ్రీలీల నటించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ అనిల్ రావిపూడి సినిమా టైటిల్‌ విషయంలో చాలా కొత్తగా , యూత్‌‌కి బాగా కనెక్ట్ అయ్యేటట్లు ఉండేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Video Advertisement

బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ‘వీరసింహా రెడ్డి’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షెడ్యూల్ చివరి దశకి చేరుకోవడంతో, బాలకృష్ణ తన 108వ సినిమా పనిలో పడ్డారు.అయితే బాలయ్య ఇప్పటికే 108వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు. సమాచారం ప్రకారం డిసెంబరు 8న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న మొదటి సినిమా ఇదే.

balakrishna-anil-ravipudi

NBK108లో బాలకృష్ణ ఇప్పటి వరకూ చేయని పాత్రలో కనిపిస్తారని టాక్. ఇందులో 45 ఏళ్ల వయసు ఉన్న తండ్రి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడని, జైలు నుంచి విడుదలయ్యే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా సోనాక్షి సిన్హా, కూతురుగా పాత్రలో యంగ్ హీరోయిన్ హీరోయిన్‌ శ్రీలీల నటించనుందని టాక్. అయితే బాలకృష్ణ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతునట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాని సైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గరపాటి, హారిష్ పెద్ది నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.అయితే అనిల్ రావిపూడి తమన్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే. బాలకృష్ణ అఖండ మూవీకి తమన్ ఇచ్చిన సంగీతం ఆ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్యని సరికొత్త యాంగిల్‌లో చూపించబోతున్నట్లు చెప్పారు.

అనిల్ రావిపూడి ఈ సినిమాకి ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లుగా ఫిలిమ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ కూడా ఈ టైటిల్‌ పై హింట్ కూడా ఇచ్చాడు. బాలకృష్ణ, తనని బ్రో అని ఫోన్‌లో పిలిచినట్లు విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’చిత్ర ట్రైలర్ లాంచ్‌ వేదిక పై చెప్పుకొచ్చాడు.కానీ తాను మాత్రం బాలయ్యని తిరిగి బ్రో అని పిలవలేకపోయినట్లు విశ్వక్ సేన్ తెలిపాడు. అనిల్ రావిపూడి ‘బ్రో ఐ డోంట్ కేర్’ టైటిల్‌ని బాలయ్యకి చెప్పినట్లు తెలుస్తోంది.అందులోనూ అనిల్ రావిపూడి మూవీ టైటిల్స్ అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి.అనిల్ రావిపూడి సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్-2, ఎఫ్-3 విభిన్నాంగా ఉంటాయి.


You may also like

Leave a Comment