జీరో కలెక్షన్ మూవీ: ఒక్క రూపాయి కూడా వసూలు చేయని ఈ నందమూరి హీరో సినిమా ఏదో తెలుసా.?

జీరో కలెక్షన్ మూవీ: ఒక్క రూపాయి కూడా వసూలు చేయని ఈ నందమూరి హీరో సినిమా ఏదో తెలుసా.?

by Harika

2023 డిసెంబర్ 2న బ్రీత్ అనే సినిమా ఒకటి విడుదల అయింది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియలేదు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు నందమూరి జయకృష్ణ కుమారుడు అయిన నందమూరి చైతన్య కృష్ణ 40 సంవత్సరాల వయసులో తనని తాను హీరోగా ప్రకటించుకొని ఈ సినిమా లో నటించారు. కుమారుడు చైతన్య కృష్ణతో సినిమా తీయడం కోసం ఆయన తండ్రి నందమూరి జయకృష్ణ బసవ తారకరామ క్రియేషన్స్ పేరుతో ఏకంగా నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు.

Video Advertisement

ఈ బ్యానర్ లో తొలి చిత్రం గా బ్రీత్ నిర్మించారు. వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రచారం కూడా బాగానే చేశారు చైతన్య కృష్ణ. సినిమా విడుదలకు ముందు పలు యూట్యూబ్ ఛానల్ లకు చైతన్య కృష్ణ ఇంటర్వ్యూలు ఇచ్చారు. పనిలో పనిగా తన బాబాయి అయిన బాలకృష్ణ గురించి మావయ్య చంద్రబాబు నాయుడు గురించి చైతన్య కృష్ణ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో అంట ట్రోలింగ్ కూడా అయ్యాయి.

అలాగే తనకు ఇన్నాళ్లు మంచి స్క్రిప్ట్ దొరకలేదని బ్రీత్ స్క్రిప్ట్ తనకి నచ్చడంతో ఆలస్యం చేయకుండా నిర్మించాలని చెప్పుకొచ్చారు చైతన్య కృష్ణ. మెడికల్ మాఫియాను బయటపెట్టే ఎమోషనల్ థ్రిల్లర్ ఈ సినిమా. అయితే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో చైతన్య కృష్ణ నెట్టుకు రావటం చాలా కష్టమైన పని అయినప్పటికీ ధైర్యం చేసి మరి బ్రీత్ అనే సినిమాను స్వయంగా నిర్మించి నాలుగు కోట్లు ఈ సినిమా కోసం ఖర్చుపెట్టినట్లు సమాచారం.

అయినప్పటికీ ఈ చిత్రాన్ని చూడటానికి ఎవరూ ధియేటర్లకు వెళ్లలేదు.నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాకి వెళ్లకపోవడం గమనార్హం. దీంతో చైతన్య కృష్ణ థియేటర్లకు అద్దె కట్టి మరీ బ్రీత్ సినిమాను ఆడించారని సమాచారం. కలెక్షన్ల పరంగా సినిమా చరిత్రలో ఇదొక జీరో కలెక్షన్ మూవీ అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


You may also like

Leave a Comment