Ads
నందమూరి కుటుంబం నుండి మరొక హీరో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ హీరో కొన్ని సంవత్సరాల క్రితం సినిమాల్లో నటించి, మధ్యలో విరామం తీసుకొని, మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమాతో అలరించారు. ఆ హీరో పేరు నందమూరి చైతన్య కృష్ణ. నందమూరి చైతన్య కృష్ణ కొత్తగా నటించిన సినిమా పేరు బ్రీత్. 20 సంవత్సరాల హీరోగా చేసారు. కానీ ఈ సినిమా పెద్ద డిసాస్టర్ అయ్యింది. ఇటీవల థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. జీరో కలెక్షన్స్ రావడంతో విపరీతంగా ట్రోల్ చేసారు ఈ సినిమాని. అలా ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోకి రావడంతో అసలు ఈ సినిమాలో ఏముందా అని ఆడియన్స్ చూసేస్తున్నారు అంట ఈ సినిమాని.
Video Advertisement
నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో, వైదిక సెంజలియా హీరోయిన్ గా నటించగా, వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, భద్రమ్, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య పాత్రల్లో నటించారు. బసవతారకరామ్ బ్యానర్ మీద నందమూరి జయకృష్ణ ఈ సినిమాని నిర్మించారు. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మార్క్ కే రాబిన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే, ఆదిత్య వర్మ (కేశవ్ దీపక్) పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకరోజు గోల్ఫ్ ఆడుతూ ఆదిత్య వర్మ స్పృహ తప్పి పడిపోతాడు.
దాంతో ఆయనని బ్రీత్ అనే హాస్పిటల్ కి తరలిస్తారు. అదే సమయంలో ఆదిత్య వర్మని చంపడానికి కొంత మంది ప్లాన్ వేస్తూ ఉండగా, వారి నుండి ఆదిత్య వర్మని కాపాడడానికి అభి (నందమూరి చైతన్య కృష్ణ) వస్తాడు అసలు అభి, ఆదిత్య వర్మని ఎందుకు కాపాడాలి అనుకున్నాడు? ఆదిత్య వర్మని చంపాలి అనుకున్నది ఎవరు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. వైద్య రంగంలో జరిగే విషయాల మీద ఈ సినిమా రూపొందించారు.
అయితే, టేకింగ్ పరంగా మాత్రం కొన్ని పొరపాట్లు జరిగాయి. అందులోనూ ముఖ్యంగా అభికి, ఆదిత్య వర్మకి ఉన్న సంబంధాన్ని తెరపై ఇంకా బాగా చూపించే ప్రయత్నంలో విఫలం అయ్యారు. నటీనటుల పర్ఫార్మెన్స్ లు బాగున్నాయి. కాకపోతే కామెడీ సీన్స్ మాత్రం అనవసరంగా పెట్టినట్టు అనిపిస్తాయి. పాటలు కూడా అంత పెద్దగా ఆకట్టుకోవు. సినిమా స్టోరీ పాయింట్ బాగున్నా కూడా, టేకింగ్ విషయంలో చాలా పొరపాట్లు జరగడంతో సినిమా ఆసక్తిని పెంచలేకపోయింది. అయితే అసలు ఎలా తీశారు అని తెలుసుకోవాలి అంటే మాత్రం, బ్రీత్ సినిమాని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే, ఇది ఒక యావరేజ్ సినిమా అవుతుంది.
End of Article