నాని “దసరా” స్టొరీ లీక్..! హిట్ అయ్యేలాగే ఉంది కదా..?

నాని “దసరా” స్టొరీ లీక్..! హిట్ అయ్యేలాగే ఉంది కదా..?

by Anudeep

Ads

నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

Video Advertisement

దసరా చిత్రం కోసం నాని తన లుక్స్ ని పూర్తిగా మార్చుకున్నాడు. కంప్లీట్ మాస్ హీరోగా మారిపోయాడు. అయితే ఈ మూవీ కోసం ఒక ఊరి సెట్ ని మేకర్స్ నిర్మించారని తెలుస్తోంది. ఈ సినిమా కథ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది. తన తొలి పాన్ ఇండియా చిత్రం అయినఈ మూవీ లో నాని తన గత చిత్రాలకు భిన్నంగా కనిపించనున్నాడు.

story of nani's dasara movie..!!

అయితే ఈ చిత్రం పూర్తిగా ఒక ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇందులో నాని మురికి వాడల నుంచి వచ్చిన వ్యక్తిగా కనిపిస్తే, కీర్తి సురేష్ ధనికుల అమ్మాయిగా కనిపిస్తోందని సమాచారం. వారి ప్రేమ కథలో ఎదురయ్యే సంఘర్షణే ఈ చిత్రం అని ఇన్సైడ్ టాక్. సుకుమార్ ప్రేమ కథలు తెరకెక్కించడం లో దిట్ట అని మనకి తెల్సిందే. ఆయన శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకుడు కావడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని తెలుస్తోంది.

story of nani's dasara movie..!!

శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఒక్కసారి హిట్ టాక్ తెచ్చుకుంటే వేసవి సెలవులు కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయినట్టు సమాచారం. హీరో నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘దసరా’. ఈ సినిమా రూ. 65 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ కంటే థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఎక్కువ డబ్బులే వచ్చినట్టు తెలుస్తోంది. నిర్మాత థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ బిజినెస్ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేసి సుమారు రూ. 10 కోట్ల లాభాలను ఆర్జించారని సమాచారం.


End of Article

You may also like