• చిత్రం : దసరా
 • నటీనటులు : నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి.
 • నిర్మాత : సుధాకర్ చెరుకూరి
 • దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
 • సంగీతం : సంతోష్ నారాయణన్
 • విడుదల తేదీ : మార్చ్ 30, 2023

dasara movie review

Video Advertisement

స్టోరీ :

సినిమా మొత్తం 1995లో జరుగుతుంది. వీర్లపల్లి అనే ఒక ప్రాంతంలో నివసించే ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్), సూరి (దీక్షిత్ శెట్టి) అనే ముగ్గురు మిత్రుల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో వారికి తాగడం అనేది నిజంగానే ఒక వ్యసనం కాదు. ఒక అవసరంగా మారుతుంది. అక్కడ ఉండే సిల్క్ బార్ చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అక్కడే ఉండే సింగరేణి గనులకి సంబంధించి ఒక విషయం కూడా ఉంటుంది.

keerthi suresh distributed gold coins to dasara team..

ఆ ఊరి సర్పంచ్ అయిన నంబి (షైన్ టామ్ చాకో) వల్ల వీరందరికీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలలో ధరణి ఎందుకు కలగ చేసుకోవాల్సి వచ్చింది? తర్వాత వారు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అసలు నంబి చేసే పనులు ఏంటి? ఈ సమస్యలన్నీ ధరణి ఎలా పరిష్కరించాడు? ధరణి, వెన్నెల ప్రేమ కథ ఏమయ్యింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ పాత్రలని ఎంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు నాని. నాని చేసే ప్రతి పాత్ర కూడా అందులో నాని కనిపించకుండా కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అందుకే నానికి నాచురల్ స్టార్ అనే పేరు కూడా ఇచ్చారు. నాని చేసినవి తెలుగు సినిమాలు అయినా కూడా తమిళ్, అలాగే మిగిలిన భాషల ఇండస్ట్రీలో కూడా నాని సినిమాలు తెలుసు. కానీ ఇప్పుడు దసరా సినిమా మాత్రం పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది.

dasara movie review

అంతే కాకుండా శ్రీకాంత్ ఓదెల అంతకుముందు సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో సినిమాకి, అలాగే రంగస్థలం సినిమాకి పని చేశారు. ఇది ఆయన మొదటి సినిమా. అయినా కూడా ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది. గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు మనం అంతకుముందు చాలా చూశాం. ఇది కూడా అలాంటి ఒక సినిమా. కానీ ఇందులో పాత్రలు, అలాగే వారి ఎమోషన్స్ తెరపై చాలా బాగా చూపించారు. సినిమాలో ఒక సహజత్వం ఉంది.

dasara movie review

సినిమా చూస్తున్నంత సేపు మనకి అక్కడ ఒక్క స్టార్ కానీ, ఒక్క నటుడు కానీ కనిపించరు. అందరూ ఆ పాత్రల లాగానే కనిపిస్తారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా నాని అయితే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే కీర్తి సురేష్, నాని ఫ్రెండ్ పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి కూడా చాలా బాగా చేశారు. తెలుగు వారు కాకపోయినా కూడా తెలుగు నేర్చుకొని, అందులోనూ తెలంగాణ యాస నేర్చుకొని మాట్లాడటం అంటే అభినందించాల్సిన విషయం.

minus points in nani dasara trailer

అలాగే సర్పంచ్ పాత్ర పోషించిన షైన్ కూడా బాగా నటించారు. సినిమా మొత్తానికి మాత్రం హైలైట్ అయ్యింది సినిమాటోగ్రఫీ. సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ నిజంగా సినిమాలో ప్రతి ఫ్రేమ్ కి ప్రాణం పోసింది ఏమో అనిపిస్తుంది. అలాగే సినిమాకి మరొక హైలైట్ పాటలు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విన్న పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. అలాగే అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది.

ప్లస్ పాయింట్స్ :

 • నటీనటులు
 • కథనం
 • మ్యూజిక్
 • సినిమాటోగ్రఫీ
 • క్లైమాక్స్
 • ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

 • స్లోగా సాగే కొన్ని సీన్స్
 • కొంచెం ల్యాగ్ అయిన సెకండ్ హాఫ్

రేటింగ్ :

3.25 / 5

ట్యాగ్ లైన్ :

నాని ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషించారు. అందులో సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా నాని పోషించిన ప్రతి పాత్ర ప్రేక్షకులకు చాలా నచ్చింది. కానీ ఈ పాత్ర మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే ప్రేక్షకులకి గుర్తుండిపోతుంది. సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా ప్రేక్షకులని అస్సలు నిరాశపరచదు. ఇటీవల కాలంలో వచ్చిన ఎమోషనల్ సినిమాల్లో బెస్ట్ సినిమాగా దసరా సినిమా నిలుస్తుంది.

watch trailer :