ఒక సినిమాలో ఫైట్స్, సాంగ్స్, మ్యూజిక్, డైలాగ్స్ ఎంత ముఖ్యమో.. మంచి ఫ్రేమ్స్, షాట్స్ కూడా అంతే ముఖ్యం. కొన్ని సార్లు ఒక్క మంచి షాట్ పడితే.. దానికి డైలాగ్స్, మ్యూజిక్ ఏం అవసరం లేకుండానే ప్రేక్షకుడికి కనెక్ట్ అయిపోతుంది. ఒక మంచి ఫ్రేమ్ లో దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. ఆలా నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం లో ఒక అద్భుతమైన షాట్ ఉంటుంది. అదేంటో చూద్దాం..

Video Advertisement

2019 లో హీరో నానితో, విక్రమ్ కే కుమార్ గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని తెరకెక్కించారు. బేసిక్ గా విక్రమ్ కే కుమార్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని.. ప్రేక్షకులు ఆయన చిత్రాల కోసం ఆసక్తి గా ఎదురు చూస్తుంటారు. అయితే ఈ చిత్రం లో బలమైన కథ లేకపోవడం తో ఫలితం యావరేజ్ గా వచ్చింది. అయితే చిత్ర ఫలితం ఎలా ఉన్నా.. ఈ సినిమాలోని ఇంటర్వెల్ షాట్ చాలా ఇంటెలిజెంట్ గా తీసాడు దర్శకుడు.

nani's gand leader intervel scene explained..!!

చిన్న పాప దగ్గర్నుంచి డెబ్బయ్‌ ఏళ్ల బామ్మ వరకు… అయిదు ఏజ్‌ గ్రూప్స్‌లో వున్న ఆడవాళ్లు తమకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ అజ్ఞాత శత్రువుని వెతుకుతూ బయల్దేరతారు. దీని కోసం హాలీవుడ్‌ రివెంజ్‌ కథలని కాపీ కొట్టి డైలాగ్‌ టు డైలాగ్‌ ట్రూ ట్రాన్‌స్లేట్‌ చేసే నవలా రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. అతడే పార్థసారధి (నాని). ఈ ఇంటర్వెల్ సీన్ లోనే విలన్ ఎవరు అనేది తెలుసుకుంటారు వీళ్లంతా.. అయితే ఈ సీన్ కి మహాభారతాన్ని రిఫరెన్స్ గా తీసుకున్నాడు దర్శకుడు.

 

‘నా రథానికి సారథివై నన్ను నడిపించు’ అని అర్జునుడు మహాభారతం లో కృష్ణుడిని కోరతాడు. కృష్ణుడు దానికి అంగీకరిస్తాడు. అందుకే ఆయనకు పార్థసారథి అనే పేరు వచ్చింది. ఈ సినిమాలో నాని పాత్ర పేరు పార్థసారథి. ఆయన సాయాన్ని కోరుతున్న వారు అయిదుగురు. అంటే పంచ పాండవులన్నమాట. తర్వాత విలన్ ఎవరో తెలిసిన తర్వాత వచ్చే షాట్ లో.. ఒక మీడియా వెహికల్ ఆగి ఉంటుంది. అందులో డ్రైవర్ ( రథ సారథి) ప్లేస్ లో నాని ఉండగా.. వెనక ఆ అయిదుగురు ఉంటారు.

nani's gand leader intervel scene explained..!!

తర్వాత యుద్దానికి సిద్ధం అని నాని అన్న తర్వాత ఒక జాతీయ జెండా వచ్చి ఆ కార్ పై పడుతుంది. అంటే ఇదివరకు యుద్ధం చేసినపుడు రథం పై జెండా ఉంటే యుద్దానికి సిద్ధం అని అర్థం, జెండా లేకపోతే యుద్ధం ఆపేసారనో.. లేక విశ్రాంతి తీసుకుంటున్నారనో అర్థం. ఈ విధం గా మహాభారత రిఫరెన్స్ ని ఆ షాట్ లో ప్రెసెంట్ చేసాడు దర్శకుడు.

watch video :