Ads
ఎందరో సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సంగతి మనందరికీ తెలిసిందే. రామారావు గారు, ఎంజీఆర్, జయలలిత, జయప్రద, పవన్ కళ్యాణ్, చిరంజీవి లు సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తమదైన ముద్ర వేశారు. అయితే.. సినిమా తారలు అయినా, రాజకీయ నాయకులు అయినా.. వారి పిల్లలను కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
అలానే.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ నాయకుడి కొడుకు గా నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినా.. ఆయన ఒకప్పుడు సినిమాల్లో రాణించాలని అనుకున్నారట. అందుకోసం ఆయన ప్రయత్నాలు కూడా చేశారట. తేజ దర్శకుడు గా, నితిన్ హీరో గా వచ్చిన “జయం” సినిమా ఎంతగానో హిట్ అయింది. ఆ సమయం లోనే తేజ దర్శకుడిగా సినిమా తీసి నారా లోకేష్ ను హీరో గా పరిచయం చేయాలనుకున్నారట.
ఈ విషయం అప్పట్లోనే సంతోషం అనే మ్యాగజైన్ లో పోస్టర్ గా ప్రచురించబడింది. కానీ.. ఇది కార్య రూపం దాల్చలేదు. ఆ సమయం లోనే “నిన్ను చూడాలని” అనే సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో ఛాన్స్ మిస్ అవ్వడం తో.. లోకేష్ రాజకీయ నాయకుడిగానే కొనసాగుతూ వచ్చారు.
End of Article