“నారప్ప” లో ఈ 7 మంది నటించిన పాత్రల్లో తమిళ్ లో ఎవరి నటించారో తెలుసా.?

“నారప్ప” లో ఈ 7 మంది నటించిన పాత్రల్లో తమిళ్ లో ఎవరి నటించారో తెలుసా.?

by Mohana Priya

Ads

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమా రీమేక్. ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. తెలుగు రీమేక్ కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వెంకటేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారు. వెంకటేష్ పక్కన హీరోయిన్ గా ప్రియమణి నటించారు.

Video Advertisement

narappa

వెంకటేష్ పెద్ద కొడుకు పాత్రలో కేరాఫ్ కంచరపాలెం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ రత్నం నటించారు. అయితే ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అది కూడా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పుడు థియేటర్లు అన్నీ తిరిగి తెరుస్తూ ఉండడంతో నారప్ప సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ గత కొంత కాలం నుంచి నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది అనే వార్త వినిపించింది.

narappa 1

నారప్ప సినిమా బృందం కూడా జూలై 20 వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్టుగా విడుదల అవుతోంది అనే వార్తను అధికారికంగా ప్రకటించింది. అయితే ఒరిజినల్ తమిళ్ వెర్షన్ అసురన్ లో ఎవరు ఏ పాత్ర పోషించారో, ఆ పాత్రలని తెలుగులో ఎవరు పోషించారో చూద్దాం.

ధనుష్ – వెంకటేష్

తమిళ్ ధనుష్ పోషించిన హీరో పాత్రను తెలుగులో వెంకటేష్ పోషిస్తున్నారు.

మంజు వారియర్ – ప్రియమణి 

తమిళ్ లో మంజు వారియర్ పోషించిన పాత్రని తెలుగులో ప్రియమణి చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ – రావు రమేష్

తమిళ్ లో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్ర ని తెలుగు లో రావు రమేష్ గారు పోషిస్తున్నారు.

ఆడుకలం నరేన్

తమిళ్ లో ఆడుకలం నరేన్ పోషించిన పాత్రని తెలుగులో కూడా ఆయనే చేస్తున్నారు.

అభిరామి

తమిళ్ లో అమ్ము అభిరామి పోషించిన పాత్రని తెలుగులో కూడా తనే చేస్తున్నారు.

పశుపతి – రాజీవ్ కనకాల

తమిళ్ లో పశుపతి పోషించిన పాత్ర ని తెలుగు లో రాజీవ్ కనకాల పోషిస్తున్నారు.

టీజే అరుణాసలం – కార్తీక్ రత్నం

తమిళ్ లో టీజే అరుణాచలం పోషించిన హీరో మొదటి కొడుకు పాత్ర ని తెలుగులో కంచరపాలెం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక్ రత్నం చేస్తున్నారు.

వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రముఖ నటులు నారప్ప సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు పోషించారు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like