నారప్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటులలో అభిరామి ఒకరు. అయితే అభిరామిని మనం అంతకుముందే కొన్ని సినిమాల్లో చూశాం. అభిరామి చెన్నైలో పుట్టి పెరిగారు. కార్తీ హీరోగా నటించిన తీరన్ అధిగారం ఒండ్రు సినిమాలో కార్తీకి చెల్లెలిగా నటించారు. ఈ సినిమా తెలుగులో ఖాకీ పేరుతో డబ్ అయ్యింది. ఆ తర్వాత రట్ససన్ సినిమాలో విష్ణు విశాల్ కి మేనకోడలిగా నటించారు.

Narappa fame Ammu abhirami

ammu abhirami in khakhee

ఈ సినిమాతో అభిరామి ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇదే సినిమా తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించారు. ఈ సినిమాలో కూడా ఒరిజినల్ వెర్షన్ లో అభిరామి ఏదైతే పాత్ర పోషించారో అదే పాత్రని రీమేక్ వెర్షన్ లో కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని నెలల క్రితం విడుదలైన ఫాదర్ ఆఫ్ చిట్టి ఉమా కార్తీక్ సినిమాలో హీరోయిన్ గా నటించారు అభిరామి.

Narappa fame Ammu abhirami

ammu abhirami in ratsasan

Narappa Movie Heroine Ammu Abhirami images

Narappa Movie Heroine Ammu Abhirami images

ఈ సినిమాలో జగపతిబాబు కూడా ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడు నారప్ప సినిమా లో వెంకటేష్ మేనకోడలిగా నటించారు అభిరామి. ఈ సినిమా ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా అసురన్ రీమేక్ అనే విషయం అందరికి తెలిసిందే. అయితే తమిళ్ లో కూడా ఈ పాత్రని అభిరామి పోషించారు.

Narappa fame Ammu abhirami

ammu abhirami in narappa

తమిళంలో కార్తీ హీరోగా నటించిన తంబి సినిమాలో జ్యోతిక చిన్నప్పటి పాత్రలో కూడా అభిరామి నటించారు. ఈ సినిమా తెలుగులో దొంగ పేరుతో డబ్ అయ్యింది. అభిరామి ప్రస్తుతం మణిరత్నం గారు నిర్మించిన నవరస అనే ఒక సిరీస్ లో కూడా నటించారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.

Narappa fame Ammu abhirami

ammu abhirami in navarasa

తొమ్మిది మంది దర్శకులు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో రతీంద్రన్ ఆర్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఎపిసోడ్ లో నటించారు అభిరామి. ఇందులో సిద్ధార్థ్, పార్వతి తిరువోతు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది.

ALSO CHECK: AMMU ABHIRAMI IMAGES