PREMALU REVIEW : ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ మలయాళం డబ్బింగ్ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

PREMALU REVIEW : ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ మలయాళం డబ్బింగ్ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

PREMALU REVIEW: కొన్ని సినిమాలు విడుదల అయ్యే సమయానికే మన తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తే, కొన్ని సినిమాలు మాత్రం విడుదల అయ్యాక, హిట్ అయ్యాక తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. అలా ఇప్పుడు మలయాళంలో ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : ప్రేమలు
  • నటీనటులు : నస్లెన్ కె గఫూర్, మమిత బిజు, అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్.
  • నిర్మాత : ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్.
  • దర్శకత్వం : గిరీష్ ఎ డి
  • సంగీతం : విష్ణు విజయ్
  • విడుదల తేదీ : మార్చి 8, 2024

premalu movie review

స్టోరీ :

సచిన్ (నస్లెన్ కె గఫూర్) ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. ఇంట్లో తన తల్లిదండ్రులకి పడదు. యూకేకి వెళ్ళిపోవాలి అని సచిన్ అనుకుంటాడు. అంతలో వీసా సమస్య ఎదురవుతుంది. వీసా రావాలి అంటే ఇంకొక 6 నెలలు ఎదురు చూడాలి. తన ఇంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో, అదే సమయంలో సచిన్ స్నేహితుడు అమూల్ (సంగీత్ ప్ర‌తాప్‌) సలహాతో గేట్ కోచింగ్ లో జాయిన్ అవుతాడు. దాని కోసం హైదరాబాద్ కి వస్తారు.

premalu movie review

అక్కడ ఒక పెళ్లిలో సచిన్ రీను (మమిత బిజు) ని చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ స్నేహితులు అవుతారు. కానీ రీనుకి కావాల్సిన క్వాలిటీస్ ఏవి కూడా సచిన్ లో ఉండవు. ఆ తర్వాత ఏం జరిగింది? గతంలో సచిన్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి తన ప్రేమని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు రీనుకి తన ప్రేమని చెప్పగలుగుతాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

premalu movie review

రివ్యూ :

ఒక సినిమా ప్రేక్షకులకి నచ్చాలి అంటే, కొత్త కథ ఉండాలి, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండాలి, అందులో పాత్రలు కూడా డిఫరెంట్ గా ఉండాలి అనే అవసరం లేదు. రొటీన్ కథ అయినా కూడా టేకింగ్ బాగుంటే ప్రేక్షకులకి ఆటోమేటిక్ గా నచ్చుతుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ అంటే అది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్. కాబట్టి ఏ భాషలోకి అయినా ఈ సినిమాలని డబ్బింగ్ చేసి విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ఇదే అవకాశాన్ని తెలుగులో రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ తీసుకున్నారు.

premalu movie review

ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొని తెలుగులో విడుదల చేశారు. ఇది నిజంగానే ఒక సక్సెస్ ఫుల్ ప్రయత్నం. సినిమా కథ మనకి తెలిసిన కథ. కానీ టేకింగ్ పరంగా బాగుంది. ఇటీవల కాలంలో ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఇది చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా నవ్విస్తారు. ఈ సినిమా హైదరాబాద్ లో తీశారు. దాంతో మన తెలుగు నేటివిటీకి దగ్గరగా అనిపిస్తుంది.

premalu movie review

ఈ సినిమాకి ఇటీవల విడుదల అయిన 90స్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించారు. అవి చాలా వరకు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. సోషల్ మీడియా రిఫరెన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా మనకు తెలిసిన వారు కాదు. అయినా కూడా చాలా బాగా చేశారు. వాళ్ళని చూస్తుంటే ఒక కొత్త వాళ్లను చూస్తున్న ఫీలింగ్ రాదు. వారి పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. సినిమా కోసం ఒక బలమైన గొడవ పెట్టాలి అని దర్శకుడు గిరీష్ అనుకోలేదు.

premalu movie review

సాధారణంగా చాలా మంది జీవితాల్లో జరిగే విషయాలు, ఆ విషయాల నుండి వచ్చే గొడవలు. వాటిని ఎలా పరిష్కరించుకున్నారు. ఇదే విషయం మీద సినిమా అంతా కూడా నడుస్తుంది. అయితే సినిమా స్టార్ట్ అవ్వడం మాత్రం సాధారణంగానే స్టార్ట్ అవుతుంది. కాస్త స్లోగా ఉంటుంది. ఆ తర్వాత నుండి వచ్చే ఎపిసోడ్స్ మాత్రం వేగంగా నడుస్తాయి. కొన్ని ఊరి పేర్లు విషయంలో కూడా తెలుగు డబ్బింగ్ లో కన్ఫ్యూజన్ గా అనిపిస్తాయి. విష్ణు విజయ్ అందించిన సంగీతం కూడా బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటుల పర్ఫామెన్స్
  • ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సీన్స్
  • డైలాగ్స్
  • కామెడీ

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

పేరుకి మాత్రమే ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్. కానీ కుటుంబం అంతా కూడా కలిసి చూసే అంత మంచి కథనం ఉంది. కొత్త కథ ఎక్స్పెక్ట్ చేయకుండా, సరదాగా అలా నవ్వుకుందాం అని అనుకునే వారికి ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఇటీవల కాలంలో వచ్చిన కామిడీ ఎంటర్టైనర్స్ లో ప్రేమలు సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like