కొంతమంది దర్శకులు కెరీర్ ప్రారంభంలో ఎన్నో చిన్న చిన్న చిత్రాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వారు స్టార్ డైరెక్టర్ లుగా వెలుగొందుతున్నా కూడా వారి కెరీర్ ఆరంభంలో ఏదో ఒక గుర్తింపు లేని సినిమా తీసిన వారై ఉంటారు. ఎస్ఎస్ రాజమౌళి కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో టీవీ సీరియల్ కి డైరెక్షన్ వహించారు. అలా చాలామంది లైమ్ లైట్ లోకి రాకముందు చిన్నవారిగా మొదలుపెట్టిన వారే.

Video Advertisement

అలాంటి ఒక డైరెక్టర్ తాజాగా నేషనల్ అవార్డు కూడా పొందారు. ఆమె ఎన్నో చిత్రాలు ఇప్పుడు స్టార్ హీరోలతో డైరెక్షన్ చేస్తున్నారు. ఆమె ఒక లేడీ డైరెక్టర్. సూర్యతో ఆకాశమని హద్దురా అనే మూవీ తీసిన డైరెక్టర్ ఆమె ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఎస్ ఆమె సుధా కొంగర. వెంకటేష్ తో గురు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

తర్వాత తీసిన ఆకాశమేని హద్దురా మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాంటిది సుధాకర తెలుగులో ముందు ఒక చిన్న సినిమా తీశారని ఎవరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా పేరు ఆంధ్ర అందగాడు. ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్, శ్రీ తేజ ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా చూసిన ఎవ్వరైనా ఇది సుధ కొంగర డైరెక్ట్ చేశారు అంటే నమ్మలేరు.

ఎందుకంటే ఆ మూవీ సినిమాకి తక్కువ,సీరియల్ కి ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి మూవీ నేషనల్ అవార్డ్ విన్నర్ తీశారా ఏంటి నోరెళ్ళబెడుతున్నారు.సక్సెస్ రావాలంటే టైం పడుతుంది. అలా డైరెక్టర్ సుధా కొంగర కూడా ఆత్మవిశ్వాసంతో ఎదురు చూసి ఈ రోజు ఒక స్టార్ డైరెక్టర్ గా నిలబడ్డారు ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో సూర్యతో ఒక కొత్త మూవీని అనౌన్స్ చేశారు. అది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వీరి కాంబినేషన్ పైన భారీ అంచనాలు ఉన్నాయి.

 

Also Read:మహేష్ బాబు కోసం పవన్ కళ్యాణ్….ఎంటి సంగతి?