జాతీయ అవార్డు ఇవ్వడానికి ఇన్ని నియమాలు ఉంటాయా..? అవి ఏంటంటే..?

జాతీయ అవార్డు ఇవ్వడానికి ఇన్ని నియమాలు ఉంటాయా..? అవి ఏంటంటే..?

by kavitha

Ads

ఇటీవల 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. తొలిసారిగా తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో సంతోషం వెల్లివిరిసింది. ఈ ఏడాది టాలీవుడ్ కి అత్యధిక అవార్డులు రావడంతో ఇండస్ట్రీలో సంబరాలు చేసుకుంటున్నారు.

Video Advertisement

చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలలో ఇది ఒకటి. నేషనల్ అవార్డులను సినీరంగంలో చెరగని ముద్రవేసిన ప్రతిభావంతులకు, సినీ రంగానికి చేసిన కృషి, అంకితభావం, సృజనాత్మకతకు నిదర్శనంగా ఈ అవార్డులను అందిస్తారు. అయితే జాతీయ అవార్డు రావాలంటే పాటించాల్సిన నియమాలు ఇప్పుడు చూద్దాం..
జాతీయ చలనచిత్ర అవార్డులను భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటిగా పరిగణిస్తారు.  మొదటిసారి జాతీయ అవార్డులను 1954లో అందించారు. ఈ అవార్డులను భారతీయ కళలు మరియు సంస్కృతిని కలిగి ఉన్న సినిమాలకు, దేశీయ వ్యక్తులు దర్శకత్వం వహించిన సినిమాలను గౌరవించడానికి మరియు  ప్రోత్సహించడం కోసం ఈ అవార్డులు ప్రవేశపెట్టారు.
1973 నుండి ఈ అవార్డు వేడుకలు భారత ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా నిర్వహించబడుతున్నాయి.  ప్రతి సంవత్సరం ఈ వేడుకను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. ఈ వేడుకలో విజేతలకు భారత రాష్ట్రపతి అవార్డులను ప్రధానం చేస్తారు. ఈ వేడుక తరువాత నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలను ప్రదర్శిస్తారు. జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు ప్రధాన విభాగాలగా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్‌లు మరియు నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద విజేతలను 13 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో విజేతలను 5 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. జాతీయ అవార్డుకు సెలెక్ట్ కావడం కోసం పలు  నియమాలను పాటించాల్సి ఉంటుంది. వీటి ప్రకారం ఎంట్రీకి పంపించే సినిమా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందాలి.
అప్పుడే ఈ పోటీలో పాల్గొనే అర్హత ఉంటుంది. ఈ పోటీలోకి వచ్చే సినిమాలు ఇండియాలోనే నిర్మించబడాలి. సినిమాకు విదేశీ సంస్థ సహ-నిర్మాతగా ఉంటే, మరో 6 షరతులను నెరవేర్చాల్సి ఉంటుంది. అన్ని షరతులను పూర్తి చేసిన తర్వాత, సినిమా ఎంట్రీ లిస్ట్ కి అర్హత పొందింది. పోటీలో పాల్గొనే సినిమాకి భారతీయుడు దర్శకత్వం వహించి ఉండాలి. సినిమా పోటీలో ఎంట్రీ పొందడానికి ఇది ముఖ్యమైనది.

Also Read: ఎన్టీఆర్ “నాణెం” ఆవిష్కరణ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెళ్లలేదు..? అసలు విషయం ఏంటంటే..?

 

 


End of Article

You may also like