తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన నటుల్లో మొట్టమొదటిగా వచ్చే నటుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించి, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు.

Video Advertisement

ఇప్పటికి కూడా తెలుగు సినిమా అంటే గుర్తొచ్చే మొదటి పేరు నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఎంతటి స్థాయిలో గుర్తింపు పొందారు అనే విషయాన్ని మనమే అర్థం చేసుకోవచ్చు. కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాల్లో చేరి ప్రజలకి సేవ చేశారు ఎన్టీఆర్.

why jr ntr did not attended ntr coin launch

అయితే ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు 100 రూపాయల నాణాన్ని విడుదల చేస్తున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఈ నాణెం విడుదల చేశారు. ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఈ వేడుక జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్లు, అల్లుళ్లు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఈ వేడుకకి హాజరు అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

why jr ntr did not attended ntr coin launch

అంతే కాకుండా ఎన్టీఆర్ కి పరిచయం ఉన్న సన్నిహితులు అయిన చాలా మంది కూడా ఇందులో పాల్గొంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. అందరూ జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్ కి వస్తారు అని అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో పాల్గొనలేదు. దానికి కారణం ఏంటి అని అందరూ ఆలోచనలో పడ్డారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు అని సమాచారం. సినిమా కోసం ఇప్పటికే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు. షెడ్యూల్ అంతా కూడా చాలా టైట్ గా ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ కి ఈ వేడుకకి హాజరు అవ్వడానికి సమయం కుదరలేదు అనే వార్త వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ కూడా ఈ వేడుకకి హాజరు అయ్యారు.

ALSO READ : జై భీం.. రియల్ లైఫ్ సినతల్లి స్టోరీ తెలుసా..? ఆ కేసు గెలిచాక కూడా ఎన్ని ఇబ్బందులు పడిందంటే..?