ఈ మధ్య వెబ్ సిరీస్ కి సినిమాలతో సమానంగా క్రేజ్ వస్తోంది. ఎంతో మంది పెద్దపెద్ద నటీనటులు కూడా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. నవదీప్ హీరోగా నటించిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఇవాళ ఆహాలో విడుదల అయ్యింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- వెబ్ సిరీస్ : న్యూసెన్స్,
- నటీనటులు : నవదీప్, బింధు మాధవి, మహిమా శ్రీనివాస్, నంద గోపాల్, కట్టా ఆంటోని
- నిర్మాత : టీజీ విశ్వప్రసాద్
- దర్శకత్వం : శ్రీ ప్రవీణ్ కుమార్
- ఓటీటీ వేదిక : ఆహా
- ఎపిసోడ్స్ : 6
- విడుదల తేదీ: మే 12, 2023
స్టోరీ:
మదనపల్లిలో ఉండే శివ (నవదీప్) రిపబ్లిక్ ఛానెల్‌లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు. శివ గ్రామంలోని సమస్యల్ని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ, డబ్బు కోసం వార్తల్ని రాస్తూ బ్రతుకుతుంటాడు. ఆ గ్రామంలో ఉండే అధికార పార్టీ లీడర్ కరుణాకర్‌రెడ్డి(గబ్బర్)కి అపోజిషన్ లీడర్ నాగిరెడ్డికి మధ్యన ఆధిపత్యం కోసం పోరు నడుస్తుంటుంది. జర్నలిస్ట్ శివ మరియు అతని ఫ్రెండ్స్ ఇద్దరికి సపోర్ట్ గా ఉంటూ వారి దగ్గర నుండి డబ్బులను తీసుకుంటూ ఉంటారు.
అయితే స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు కరుణాకర్ రెడ్డి వైపు ఉన్న శివ,అపోజిషన్ లీడర్ నాగిరెడ్డి అక్రమంగా చేసే దందాలను అందరి ముందు బయట పెడతాడు. దాంతో నాగిరెడ్డి,అతడి అనుచరుడు శివ పై దాడిచేస్తారు.ఆ దాడి నుండి శివ ఎలా తప్పించుకున్నాడు? అసలు జర్నలిస్ట్ శివ డబ్బు కోసం పనిచేయడానికి కారణం ఏమిటి? మదనపల్లి కొత్త ఎస్ఐ కు శివ మీద పగ ఎందుకు? ఇద్దరు జర్నలిస్టులలో శివ ఎవరిని ప్రేమించాడు? అనేదే న్యూసెన్స్ స్టోరీ.రివ్యూ:
టాలీవుడ్ లో మీడియా నేపథ్యంలో ఇప్పటివరకు తక్కువగా సంఖ్యలో చిత్రాలు, సిరీస్‌లు వచ్చాయి. ఈ కారణంగానే ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ విడుదలకు ముందు నుండే ఆడియెన్స్ కి ఆసక్తి ఏర్పడింది. గవర్నమెంట్ కు ప్రజలకు మద్య వారధిగా ఉండవలసిన మీడియా, జర్నలిస్టులు, డబ్బుకు దాసోహం అంటే సొసైటీలో పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయన్ని ఇందులో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.తొలి సీజన్ ఆరు-ఎపిసోడ్‌ల సిరీస్. స్టోరీ మొదలైన విధానం బాగున్నప్పటికీ, అదే ఇంటెన్సిటీ తో చివరి వరకు కొనసాగించలేకపోయారు. దర్శకుడు హీరో పాత్ర ద్వారా ఏం చెప్పాలని అనుకున్నాడో క్లారిటీ లేదు.రిపీటెడ్ సన్నివేశాలు, పొలిటికల్ సన్నివేశాలు అంతగా పండలేదు.నవదీప్, బిందుమాధవి పాత్రల నటన తప్ప మిగిలిన క్యారెక్టర్స్ నటన సహజంగా అనిపించదు. కథలో ఎస్ఐ ఎడ్విన్ పాత్ర ఎంట్రీ తరువాత కథనం కాస్త ఊపందుకుంది.
తొలి సీజన్ చివరలో ఎస్ఐకు శివకు మధ్య గొడవతో ఎండ్ చేయడంతో సీజన్ 2 పై కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. జర్నలిస్ట్ శివగా సీరియస్‌గా ఉండే పాత్రలో నవదీప్ ఒదిగిపోయాడు.సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. శివను ఇష్టపడే నీల పాత్రలో బిందుమాధవి నటించింది. కానీ ఈ పాత్రకు తొలి సీజన్‌లో అంతగా ఇంపార్టెన్స్ లేదు. పోలీస్ ఆఫీసర్ ఎడ్విన్ క్యారెక్టర్ లో నంద గోపాల్ నటన అద్బుతంగా ఉంది. శివ స్నేహితులు నటన,కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్:
- సిరీస్ నేపధ్యం
- నవదీప్ నటన
- కొన్ని డైలాగ్స్
- బ్యాగ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
- స్లో నేరేషన్
- ఎమోషన్ లేకపోవడం
రేటింగ్ :
2.75/5
టాగ్ లైన్ :
రిపోర్టర్ల జీవితాన్ని చూపించే ‘న్యూసెన్స్’
watch trailer :