న్యూ ఇయర్ అంటే మనకి గుర్తొచ్చేది పార్టీలు. చాలా మంది వారి స్నేహితులతో కలిసి సరదాగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అలానే కుటుంబ సభ్యులతో కూడా సరదాగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కొందరైతే న్యూ ఇయర్ ని విదేశాల్లో జరుపుకుంటూ వుంటారు.

Video Advertisement

ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ న్యూ ఇయర్ ఫొటోస్ షేర్ చేసారు. అయితే ఈ న్యూ ఇయర్ ని నయనతార విగ్నేష్ దంపతులు కాస్త కొత్తగా జరుపుకున్నారు.

nayanatara surrogacy is legal says goverment comittee

వాళ్లు చేసిన పనిని చూసి నెటిజెన్లు ఇద్దరినీ అభినందిస్తున్నారు. వీరి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ శివన్ ప్రేమించుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలని కన్నారు. ఆ తర్వాత నయనతార కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే మరి ఈ జంట న్యూ ఇయర్ ని ఎలా జరుపుకున్నారు అనేది చూస్తే… నయనతార విగ్నేష్ దంపతులు కాస్త వెరైటీగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. వీళ్ళు ఈ న్యూ ఇయర్ ని పబ్బుల్లో జరుపుకోలేదు. విదేశాలకి కూడా వెళ్ళలేదు. కనీసం పార్టీలకి వెళ్ళు వెళ్ళలేదు.

అలా అని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోలేదు. కొన్ని బహుమతులని నయనతార విగ్నేష్ తీసుకు వెళ్లి రోడ్డు మీద నిరుపేదలకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఎంత మంచి విషయంలో కదా..? అయితే ఇలా నయనతార విగ్నేష్ తీసుకు వెళ్లి రోడ్డు మీద నిరుపేదలకి గిఫ్ట్ ఇవ్వడం తో అక్కడ వాళ్లంతా ఎంతో ఆనందంగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. నయనతార విగ్నేష్ చేసిన ఈ పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు ఎంతో గొప్ప హృదయం తో పేదలకు బహుమతులు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నయనతార బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలో నటిస్తున్నారు. అవకాశాలు కూడా ఈమెకి వస్తున్నాయి.