నయనతార అన్న ఎవరో మీకు తెలుసా.. ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

నయనతార అన్న ఎవరో మీకు తెలుసా.. ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

by Harika

Ads

లేడీ సూపర్ స్టార్ గా పేరు గాంచిన నయనతార తమిళం తో పాటు తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. అన్ని భాషల్లో కలిపి 80 పైగా సినిమాల్లో నటించింది. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ సంపాదించింది నయనతార. అంతేకాకుండా దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న తారలలో నయనతార ఒకరు. ఈమె మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, ఎన్టీఆర్, బాలకృష్ణ, విజయ్, అజిత్, సూర్య ఇలా ప్రతి ఒక్కరికి జోడిగా నటించి మెప్పించింది.

Video Advertisement

ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే రెండుసార్లు ప్రేమలో విఫలం అయిన ఈ బ్యూటీ ముచ్చటగా మూడోసారి ప్రేమలో విజయం సాధించింది. ఐదేళ్ల ప్రేమ తరువాత పెళ్లి చేసుకున్న ఈ జంటకి ఇప్పుడు వయా, ఉలాగ్ అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత నయనతార వరుసగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భర్త మరియు పిల్లల ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

nayanatara surrogacy is legal says goverment comittee

అయితే ఈమె తన పుట్టింటికి సంబంధించిన వివరాలను ఎప్పుడూ బయట పెట్టదు. అయితే ఆమెకి తల్లి తండ్రి తో పాటు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు లెనోవో. అతను దుబాయ్ లో ఉంటూ పెద్ద పెద్ద బిజినెస్ లు చేస్తూ వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడని సమాచారం. నయన్, విగ్నేష్ శివన్, లెనోవో కలిసి ఉన్న ఫోటో ఒకటి నయనతార సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ఇప్పటివరకు నయన్ కి ఒక అన్న ఉన్నాడని తెలియక పోవడంతో జనాలు షాక్ అయ్యారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో నయనతార మరియు విగ్నేష్ శివన్ ఇద్దరి భుజాలపై చేతులు వేసుకొని కౌగిలించుకొని ఉన్నాడు లెనోవో. నయనతార తన అన్న ద్వారా దుబాయ్ లో బిజినెస్ చేస్తుందని అందుకే అక్కడ భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేస్తుందని సమాచారం.


End of Article

You may also like