Ads
ఇటీవలే అఖండ చిత్రంతో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుగా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK 107. ఇది బాలకృష్ణ 107 వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
Video Advertisement
ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో శాండిల్ వుడ్ హీరో దునియా ఫేమ్ విజయ్ విల్లన్ గా నటిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్లకు చూసినవారు ఇది అవేరేజ్ గా ఉందంటూ టాక్ వినిపిస్తుంది. ఈ పోస్టర్ చూడడానికి బోయపాటి కాంబినేషన్ లో బాలకృష్ణ చేసిన సినిమా పోస్టర్లు మాదిరిగా ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా NBK 107కి ఒక టైటిల్ ని రిలీజ్ చేస్తారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి అన్నగారు, వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది ఫైనల్ గా ఈ చిత్రానికి “రెడ్డిగారు” అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అసలు టైటిల్ ఎంతవరకు నిజమో అనే విషయం తెలియాలంటే బాలకృష్ణ పుట్టిన రోజు వరకు ఎదురు చూడవలసిందే. రెడ్డిగారు టైటిల్ ఖరారు అయ్యింది అనే విషయం నిజమైతే, ఈ రెడ్డిగారు టైటిల్ పై ఎన్ని అబద్ధాలు వెళ్లడం అవుతాయో వేచి చూడాలి.
End of Article