Ads
నందమూరి నటసింహం బాలకృష్ణ, కమర్షియల్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ కాంబినేష్ లో, ఎన్ బీ కె 107 వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. మలినేని డైరెక్షన్ లో వచ్చిన లాస్ట్ మూవీ క్రాక్ సూపర్ హిట్ అయ్యింది. మరోవైపు అఖండతో బాలయ్య బంపర్ హిట్ కొట్టారు. దీంతో ఈ ఇద్దరి కాంబోలో మూవీ అనగానే నందమూరి అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదైన పోస్టర్లు, టీజర్, ఈ సినిమా పై అంచానాలు భారీగా పెంచేశాయి.
Video Advertisement
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయలేదు మేకర్స్. చిత్ర యూనిట్ ప్లాన్ ఏంటో తెలియదుకానీ, టైటిల్ ను మొదటి నుండి సస్పెన్స్ గానే ఉంచారు. అయితే ఇప్పుడు దీపావళి కానుకగా ఎన్ బీ కె 107 టైటిల్ ను అనౌన్స్ చేయనున్నట్లు, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ ఈవెంట్ కు చారిత్రక కట్టడమైన కర్నూలు కొండారెడ్డి బురుజును ఎంపిక చేయడంతో, బాలయ్య ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఫస్ట్ టైమ్ సీమలో ఉన్న ఐకానిక్ ప్లేస్ కొండా రెడ్డి బురుజు వేదికగా అక్టోబర్ 21న సాయంత్రం 8:15 నిముషాలకు, ఎన్ బీ కె 107 టైటిల్ ను లాంచ్ చేయనున్నారు.
అయితే ఈ సినిమాకు రెడ్డిగారు, జై బాలయ్య అనే టైటిల్స్ పెట్టనున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో టాక్ నడిచింది. కాగా ఇప్పుడు సరికొత్త టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘వీర సింహా రెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. ఇదే విషయాన్ని వచ్చే శుక్రవారం ప్రకటించనున్నారట టీమ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా మొన్నటి వరకు టర్కీలో ఓ షూటింగ్‌ను జరుపుకుంది.
ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక మరోవైపు బాలయ్య 108వ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ సినిమాకు కూడా థమనే మ్యూజిక్ అందించనున్నారు. దీనికి సంబంధించి ఎన్ బీ కె 108 మూవీ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
End of Article