“డీజే టిల్లు2” ట్రైలర్ లో కనిపించిన ఈమె ఎవరో గుర్తుపట్టారా.? ఎమోషనల్ అవుతూ ఏమని పోస్ట్ చేసారంటే.?

“డీజే టిల్లు2” ట్రైలర్ లో కనిపించిన ఈమె ఎవరో గుర్తుపట్టారా.? ఎమోషనల్ అవుతూ ఏమని పోస్ట్ చేసారంటే.?

by Mounika Singaluri

Ads

నెల్లూరు నీరజ చాలామంది తెలుగు వాళ్ళకి సుపరిచితురాలే. కామెడీ వీడియోలు తీస్తూ యూట్యూబ్ లో, ఇంస్టాగ్రామ్ లో, వెబ్ సిరీస్ లలో, చిన్న సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది నెల్లూరు నెరజ. తన కామెడీ టైమింగ్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు. పెద్ద సినిమాలలో ఎప్పుడూ నటించకపోయినా వెబ్ సిరీస్ లో మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక పాత్రలో నటిస్తూ కామెడీని పండిస్తుంది నెల్లూరు నీరజ.

Video Advertisement

తెలుగు ఇండస్ట్రీలో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మందే ఉన్నా అందులో నీరజ ఒకరు. ఎప్పటికప్పుడు తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాగైనా ఇండస్ట్రీలో రాణించాలి అని ఎల్లవేళలా కృషి చేసేది. తాజాగా నెల్లూరు నీరజ తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇందులో కన్నీళ్ళతో కనిపించిన నీరజ ని చూసి అభిమానులందరూ ఒక్కసారి గా షాక్ అయ్యారు.

నీరజ ఎమోషనల్ అవుతూ ఇప్పటివరకు నేను చాలా వెబ్ సిరీస్ లో, చిన్న సినిమాలలో నటించి కామెడీ పండించాను కానీ ఎప్పుడూ పెద్ద సినిమాలలో నటించలేదనే ఒక చిన్న వెలతి ఉండేది. చిన్న సినిమాలలో చిన్న పాత్రలు వేసినా అవి నాకు అంత ఫేమ్ ని తేలేకపోయాయి. కానీ ఇప్పుడు నాకు ఒక పెద్ద సినిమా అవకాశం వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా టిల్లు స్క్వేర్ సినిమా లో సిద్దుకి అత్తగా నటిస్తున్నాను.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. ఒక సినిమాలో ఇంత మంచి అవకాశం రావడం నేను ఎప్పటికీ మరువలేను. అదంతా మీ వల్లే అని అభిమానులకు థాంక్స్ చెప్తూ ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు నెల్లూరు నీరజ. నీరజను అంత ఎమోషనల్ గా చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. కంగ్రాట్యులేషన్స్, మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలి అని కామెంట్లు పెట్టారు.

watch video:


End of Article

You may also like