సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మోహన్ లాల్ సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మోహన్ లాల్ సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

by Harika

సినిమాలకి భాషా బేధం ఉండదు. అందులోనూ ఇప్పటి సమయాల్లో మాత్రం ఏ భాష సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే చాలా సినిమాలు అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

Video Advertisement

ఓటీటీల పుణ్యమా అని సినిమాలు ఇంకా ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అవుతున్నాయి. అలా ఇటీవల వచ్చిన సినిమా నేరు. మోహన్ లాల్, ప్రియమణి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. మలయాళంలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతోంది.

neru movie review in telugu

కథ విషయానికి వస్తే, సారా మహమ్మద్ (అనస్వర రాజన్) అనే ఒక అమ్మాయికి కళ్ళు కనిపించవు. ఒక రోజు ఆ అమ్మాయిని వేధిస్తారు. కానీ అమ్మాయిని అలా చేసిన వాళ్ళు ఎవరో తనకి తెలియదు. సారా అతని పోలికలని గుర్తు పెట్టుకొని, మట్టితో అతని రూపాన్ని తయారు చేస్తుంది. సారా తయారు చేసిన ఆ మట్టి బొమ్మ మైకేల్ (శంకర్ ఇందుచూడన్) అనే వ్యక్తి పోలికలకి దగ్గరగా ఉంటుంది. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే మైకేల్ తండ్రి చాలా పెద్ద పారిశ్రామికవేత్త. అందుకే పెద్ద లాయర్ అయిన రాజశేఖర్ సహాయంతో బెయిల్ సంపాదించుకుంటారు.

neru movie review in telugu

దాంతో సారా తల్లిదండ్రులు లాయర్ అయిన విజయ్ మోహన్ (మోహన్ లాల్)ని ఈ కేస్ వాదించడం కోసం ఆశ్రయిస్తారు. మరొక పక్క విజయ్ మోహన్ కొన్ని కారణాల వల్ల చాలా సంవత్సరాలు కోర్టుకి దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ కేస్ ఎలా వాదించాడు అనే విషయం మీద సినిమా అంతా నడుస్తుంది. సినిమా కథ చాలా బలంగా ఉంటుంది. చాలా చోట్ల నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ ఉంటుంది. అంతే కాకుండా ఒక మంచి స్టోరీకి మంచి నటీనటుల నటన తోడైతే సినిమా ఇంకొక లెవెల్ కి వెళ్తుంది అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.

neru movie review in telugu

ఈ సినిమాకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. సినిమా ఒక సెన్సిటివ్ విషయం మీద నడుస్తున్నా కూడా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది కలగనంత బాగా డీల్ చేశారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ఇంత మంచి సినిమాని తెలుగులో రీమేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఒరిజినల్ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.

ALSO READ : సీనియర్ హీరోల చూపంతా ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ పైనే అనుకుంట.? హీరోలనే డామినేట్ చేస్తుందిగా.!


You may also like

Leave a Comment