Ads
చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో నెపోటిజం (బంధుప్రీతి) విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అటు బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోనూ ఆ ఇష్యూ ఉంది. కానీ బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ అంశంపై స్పందించినంతగా టాలీవుడ్ వాళ్లు రియాక్ట్ అవ్వరు. అయితే ఈ నెపోటిజం ప్రతి రంగం లోను ఉంది. ఎవరైనా ఏదైనా రంగం లో సక్సెస్ అయితే వారి వారసులు కూడా ఆ రంగం లోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు ఆ రంగాల్లో సక్సెస్ కాలేరు. తమ టాలెంట్ తోనే తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకుంటారు.
Video Advertisement
అయితే ముఖ్యంగా సినిమాల్లో తమ వారసులు ఎదగాలని కొత్తగా వచ్చిన వారిని తొక్కేస్తారు అన్న వాదన కూడా కూడా అలాంటి సమయాల్లోనే నెపోటిజం అన్న మాటని వాడుతూ ఉంటారు. ఇది ఎక్కువగా సినీ రంగం లోనే మనం చూస్తూ ఉంటాం. సెలబ్రిటీల పిల్లలకే సినిమా అవకాశాలు ఇస్తుంటారని, వాళ్లకు మాత్రమే దర్శకనిర్మాతల నుంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందనేది ఎప్పటికీ హాట్ ఇష్యూనే. అయితే తాజాగా నెపోటిజం పై ఒక నెటిజెన్ పెట్టిన ఫన్నీ పోస్ట్ వైరల్ గా మారింది.
అసలు సినీ ఇండస్ట్రీ లో నెపోటిజం లేకపోతే ఎలా ఉంటుంది. మన స్టార్ హీరోలు అప్పుడు ఏం చేస్తూ ఉండేవారు అని ఆ పోస్ట్ లో ఉంది. ” అసలు ఇండస్ట్రీ లో నెపోటిజం లేకపోతే మహేష్ బాబు అమెరికా వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ.. ప్రీమియర్ షోస్ చూసుకుంటూ ట్విట్టర్ లో రివ్యూ లు ఇస్తూ ఉండేవాడు.. పవన్ కళ్యాణ్ ఎలాగోలా ఇంటర్ కంప్లీట్ చేసి కానిస్టేబుల్ జాబ్ కొట్టేవారు.. ప్రభాస్ అయితే రాజు గారి రుచులు అని రెస్టారెంట్ పెట్టుకొనేవాడు.. అల్లు అర్జున్ ఒక డాన్స్ స్కూల్ పెట్టుకొని ఢీ షో కి డాన్సర్స్ ని ఇస్తూ ఉండేవాడు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎదో ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో జాబ్ చేస్తూ ఉండేవారు..” అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.
నెపోటిజం అన్నది సీరియస్ ఇష్యూ నే అయినా.. ఓ నెటిజన్ ప్రస్తుతం పోస్ట్ చేసిన ఈ ఫన్నీ పోస్ట్ వైరల్ గా మారింది. మన స్టార్ హీరోలని ఇలా ఊహించుకోలేకపోతున్నాం అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
End of Article