Ads
సమంత శాకుంతలం సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను శుక్రవారం అనౌన్స్ చేశారు. వేసవి కానుకగా ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. మైథలాజిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సిఉండగా థియేటర్ ఇష్యూస్‌తో వాయిదాపడింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొన్ని పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే సినిమా రిలీజ్‌ను వాయిదావేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Video Advertisement
సినిమా పోస్ట్‌పోన్ అనౌన్స్మెంట్ వచ్చిన రెండు రోజులకే కొత్త రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేశారు. ఏప్రిల్ 14న సినిమానువిడుదల చేయనున్నట్లు తెలిపారు. శాకుంతలం సినిమా వాయిదా పడటం ఇది రెండోసారి. గత ఏడాది నవంబర్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడంతో ఫిబ్రవరికి పోస్ట్‌పోన్ అయింది. తాజాగా మరోసారి ఫిబ్రవరి నుంచి ఈ సినిమా ఏప్రిల్‌కు వెళ్లడంతో సామ్ ఫాన్స్ నిరాశకు గురయ్యారు.
మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథతో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌మోహన్ కనిపించబోతున్నారు. మోహన్‌బాబు, గౌతమి, ఈషారెబ్బా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ బాలనటిగా టాలీవుడ్లో అడుగుపెడుతోంది. భరతుడి పాత్రలో అల్లు అర్హ నటిస్తోంది.
దిల్‌రాజుతో కలిసి గుణశేఖర్ తనయ నీలిమ గుణ నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాలం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటం తో దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా లో పలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎదో సీరియల్ ఈ టైం నుంచి ఆ టైం కి అన్నట్టు రిలీజ్ డేట్స్ ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
https://www.instagram.com/p/CohiVlFJIvX/?igshid=YmMyMTA2M2Y%3D
End of Article