రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

rrr scenes inspired from these movies

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. దాంతో ప్రతి సారి కూడా, “ఈ సంవత్సరం సినిమా విడుదల అవుతుందేమో” అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇంకా ఎదురు చూడాల్సి వచ్చింది. దాదాపు రెండు సంవత్సరాలు సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత ఇప్పుడు విడుదల అయ్యింది. అందుకు ముఖ్య కారణం కరోనా. ఈ సంవత్సరం మొదట్లో విడుదల అవ్వాల్సిన సినిమా కూడా విడుదలకు వారం రోజుల ముందు వాయిదా పడినట్లు ప్రకటించారు.

tweet about rrr before its release goes viral

అయితే, ఇదిలా ఉండగా 2021 లోనే ఈ సినిమాకు సంబంధించిన స్టొరీ ఒక నెటిజన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. ఆ ట్వీట్‌లో నెటిజన్ ఈ విధంగా రాశారు. “స్కాట్ వైఫ్ కి పాప నచ్చిందని స్టార్టింగ్ లో పాపని తీసుకెళ్లిపోతారు. అక్కడి నుండి కథ మొదలవుతుంది. భీమ్ రామ్ తో ఫ్రెండ్ షిప్ చేస్తాడు. తర్వాత వ్యతిరేకంగా వెళ్ళాడు అని ఫైట్ చేస్తాడు. తర్వాత రామ్ రియలైజ్ అవుతాడు. తర్వాత రామ్ జైలుకి వెళ్లడం, రామ్ భీమ్ కాపాడడం. ఇద్దరూ కలిసి క్లైమాక్స్ ఫైట్” అని రాశారు. ఇప్పుడు చూస్తే సినిమా ఇలాగే ఉంది. దాంతో, “ఇదేంటి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పారు?” అంటూ ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.