“ఇలాంటి సీన్ పెట్టడానికి మీకు ఎంత ధైర్యం.?” అంటూ… “జై భీమ్” పై మండిపడుతున్న నెటిజన్లు..!

“ఇలాంటి సీన్ పెట్టడానికి మీకు ఎంత ధైర్యం.?” అంటూ… “జై భీమ్” పై మండిపడుతున్న నెటిజన్లు..!

by Mohana Priya

Ads

జై భీమ్ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. లాయర్ చంద్రు రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అంటూ చాలానే వారలు వచ్చాయి. లాయర్ గా సూర్య పోస్టర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై మరింత ఎక్కువగా అంచనాలు పెరిగాయి. సినిమాకి ఎంతో ముఖ్యమైన చంద్రు పాత్ర పోషించిన సూర్యకి కూడా మళ్లీ ఒక మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. అడ్వకేట్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయారు సూర్య.  అలాగే మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, రావు రమేష్, మరొక హీరోయిన్ రజిషా విజయన్ కూడా బాగా నటించారు. అక్కడ అక్కడ కొంచెం డల్ గా అనిపించినా కూడా, స్టోరీ చాలా బలంగా ఉండడంతో అలాంటి పొరపాట్లు ఏవి పెద్దగా కనిపించవు. చివరికి ఏమవుతుంది అనే ఉత్కంఠతో సినిమా సాగుతుంది.

Video Advertisement

jai bhim review

అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ప్రకాష్ రాజ్ ఆ వ్యక్తిని చంప దెబ్బ కొడతారు. అందుకు ఆ వ్యక్తి, “ఎందుకు కొట్టారు?” అని అడిగితే, “తమిళ్ లో మాట్లాడు” అని చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తి తమిళ్ లో మాట్లాడతారు. తెలుగులో, తమిళం స్థానంలో “తెలుగు” అని డైలాగ్ మార్చారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యింది.

netizens angry on a scene in jai bhim

ఇదే సన్నివేశం హిందీలో అయితే, “ఇప్పుడు నిజం చెప్పు” అని అర్థం వచ్చేలా గా ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది. “అసలు హిందీ వాళ్లంటే మీకు ఎందుకు అంత కోపం? హిందీలో మాట్లాడితే కొట్టినట్టు చూపించాల్సిన అవసరం ఏంటి? “తమిళ్ లో మాట్లాడు” అని ఒక్క మాట చెబితే చాలు కదా? దీని వెనకాల ఇంకా ఏమైనా అంతరార్థం ఉందా?” అని కామెంట్స్ మొదలయ్యాయి. ప్రకాష్ రాజ్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. రోహిత్ జైస్వాల్ అనే ఒక హిందీ క్రిటిక్ కూడా ఈ విషయం మీద సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.

netizens angry on a scene in jai bhim

దాంతో సూర్య ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన రాజశేఖర్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. రాజశేఖర్ మాట్లాడుతూ, “ఇది హిందీ వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ లేదు. ఆ సీన్లో ఆ వ్యక్తి ప్రకాష్ రాజ్ కి అర్థం అవ్వకూడదు అని హిందీలో మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయం అర్థం చేసుకున్న ప్రకాష్ రాజ్, అతడిని చంప దెబ్బ కొట్టి, తమిళ్ లో మాట్లాడమని చెప్తాడు. తమిళ దర్శక నిర్మాతలు హిందీ భాషకి వ్యతిరేకం కాదు. మాకు కేవలం ఏదైనా ఒక భాషని బలవంతంగా మాపై రుద్దితే కోపం వస్తుంది. అంతేకానీ మనందరం భారతీయులం” అని రాశారు.

netizens angry on a scene in jai bhim

ఇందుకు రోహిత్ స్పందిస్తూ, ” మా భాషకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు అని మేము అనట్లేదు. కానీ ఈ సీన్ చూస్తున్నప్పుడు నాకు కొంచెం బాధగా అనిపించింది. ప్రతి ఒక్కరికి భాషని అర్థం చేసుకోవడానికి ఒక దారి ఉంటుంది. ఈ సీన్ అంత ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక ఫిలిం క్రిటిక్ . గత కొద్ది సంవత్సరాలుగా నేను తమిళ సినిమాలని సపోర్ట్ చేస్తున్నాను. చంప దెబ్బ కొట్టడానికి బదులు తమిళ్ లో మాట్లాడు అని చెప్తే సరిపోయేది” అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ సీన్ పై మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

watch video :


End of Article

You may also like